Saturday, April 27, 2024

వివిధ కేడర్‌లలో 1,433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ కేడర్‌లకు చెందిన 1,433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. 657 ఏఈఈ, 113 ఏఈ సహా ఇతర పోస్టులు భర్తీ చేయనున్నారు. హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎస్‌వో ఇతర పోస్టుల భర్తీకీ అనుమతి ఇచ్చారు. ఇప్పటి వరకు 35,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ నియామక ఖాళీలు 91,142 ఉండగా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వారిని క్రమబద్దీకరించగా.. మిగిలిన 80,039 ఉద్యోగాల భర్తీ చేస్తామని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విషయం విధితమే.

ఈ క్రమంలో గ్రూప్ 1 పోస్టులు 503, పోలీసు, ట్రాన్స్‌పోర్ట్, ఫారెస్ట్, ఎక్సైజ్, బ్రెవరేజెస్ కార్పోరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. వైద్యారోగ్య శాఖలో 12,775 ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేయాలని, అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఇందులో తొలి విడతగా 1326 ఎంబిబిఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు.తాజాగా మున్సిపల్, పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖలోని మరో 1433 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు 35,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది.

తాజాగా భర్తీ చేయనున్న ఖాళీల వివరాలు.
గ్రామీణ నీటి పారుదల శాఖలో   420
పంచాయతీరాజ్ శాఖలో          350
పంచాయతీ రాజ్ హెచ్‌ఓడి        3
టిఎస్ ఫ్రైడ్                        2
ఎన్నికల కమిషన్                 3
మున్సిపల్ పరిపాలన హెచ్‌ఓడి  196
ప్రజారోగ్య శాఖ                    236
పట్టణ ప్రణాళిక విభాగం           223
మొత్తం                           1433

TS Finance Dept permission to 1433 posts in several cadres

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News