Friday, April 26, 2024

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

ssc-exms

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ నిబంధనలకు లోబడి జూన్‌ 8వ తేదీ నుంచి జూలై 5 వరకు పది పరీక్షలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వాయిదా పడిన టెన్త్ పరీక్షలను జూన్‌ 8 నుంచి.. ప్రతి పరీక్షకు రెండు రోజుల సెలవు ఉండేలా నిర్వహించారు. న్యాయస్థానం సూచనల మేరకు ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. దీనికోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను అవసరమవుతారని ఆమె పేర్కొన్నారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వివరాలు…
  • జూన్‌ 8న ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌
  • జూన్‌ 11న ఇంగ్లీష్‌ రెండో పేపర్‌
  • జూన్‌ 14న గణితము మొదటి పేపర్‌
  • జూన్‌ 17న గణితము రెండో పేపర్‌
  • జూన్‌ 20న సైన్స్‌(భౌతిక శాస్త్రం) మొదటి పేపర్‌
  • జూన్‌ 23న సైన్స్‌(జీవశాస్త్రం) రెండో పేపర్‌
  • జూన్‌ 26న సోషల్‌ స్టడీస్‌ మొదటి పేపర్‌
  • జూన్‌ 29న సోషల్‌ స్టడీస్‌ రెండో పేపర్‌
  • జులై 2న ఓరియంటల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌(సంస్కృతం మరియు అరబిక్‌)
  • జులై 5న ఒకేషనల్‌ కోర్సు(థియరీ)

విద్యార్థులకు దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ప్రత్యేక గదుల్లో పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య నిర్వహిస్తారు.

10th schedule

TS SSC Exam Time Table 2020 Subject Wise

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News