Monday, April 29, 2024

సివిల్ సర్వీసెస్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

TS Tribal Welfare Dept invites applications for Civil Service Classes

మన తెలంగాణ/హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు 2023కు అర్హులైన ఎస్‌సి, ఎస్‌సి, బిసి అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డా. క్రిస్టినా జెడ్ చోంగ్తూ, ఐఎఎస్ స్టడి సర్కిల్ ఫర్ ఎస్‌టి సంచాలకులు వి. సముజ్వల ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఎఎస్ స్టడి సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్దతిలో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అర్హులైన ఎస్‌టి, ఎస్‌సి, బిసి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కోసం అభ్యర్థులను ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష, ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలకు మించరాదని పేర్కొన్నారు. అభ్యర్థులు http//studycircle.cgg.gov.inలో లాగిన్ అయ్యి తేది జులై 20 నుండి ఆగష్టు 10వరకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ఆప్లికేషన్, సూచనలు http://studycircle.cgg.gov.in, http://twd.telangana.gov.in వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 6281766534 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

TS Tribal Welfare Dept invites applications for Civil Service Classes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News