Monday, April 29, 2024

పెరుగుతున్న డీజిల్ ధరలతో- ప్రతి ఒక్కరిపై ప్రభావం

- Advertisement -
- Advertisement -

ప్రత్యామ్నాయం లేక ఆర్టీసి డీజిల్ సెస్ విధించాం
నేటి నుంచి కొత్త సెస్ చార్జీలు అమల్లోకి
ప్రయాణికులు అర్థం చేసుకొని ఆదరించండి
ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ విసి అండ్ ఎండి సజ్జనార్

TSRTC charges increased in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్:  పెరుగుతున్న డీజిల్ ధరలతో- ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుందని, ప్రత్యామ్నాయం లేక ఆర్టీసి డీజిల్ సెస్ విధించామని, దీనికి -ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ విసి అండ్ ఎండి సజ్జనార్, ఐపిఎస్‌లు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్ సెస్ కింద రూ .2లు, ఎక్స్‌ప్రెస్ , డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఎసి సర్వీసుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5లు వసూలు చేయాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు.

ఈ చార్జీలు ఈ నెల 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయన్నారు. సామాన్యులు, తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణీకులపై భారం పడకుండా డీజిల్ సెన్ విధానాన్ని అముల్లోకి తీసుకొస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస చార్జీ రూ.10లుగా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసికి గుదిబండగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్గత సామర్థ్యం మెరుగవుతున్నప్పటికీ రోజు వారీ ఖర్చులు పెరిగిపోతుండటంతో సంస్థ నష్టాల్ని చవిచూడాల్సి వస్తోందన్నారు. ఆరోహణ క్రమంలో పెరిగిపోతున్న డీజిల్ ధరల వల్ల ఆర్టీసి ఆర్థిక భారాన్ని మోస్తోందన్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చడానికి నడుపుతున్న బస్సుల వినియోగానికి ప్రతి రోజు 6 లక్షల లీలర్ల హెచ్‌ఎస్‌డి అయిల్‌ను వినియోగిస్తోందన్నారు.

2021 డిసెంబర్‌లో రూ .85ల ఆయిల్ ధర

ఇటీవల కాలంలో చమురు ధరలు అమాంతంగా పెరిగాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 2021 డిసెంబర్‌లో రూ .85లు ఉన్న హెచ్‌ఎస్‌డి ఆయిల్ ధర భారీగా పెరిగి ప్రస్తుతం రూ .118లకు ఎగబాకిందన్నారు. ఈ మూడునెలల వ్యవధిలో రూ .35లు పెరిగిందన్నారు. ఇంతకాలం ఏదో రకంగా డీజిల్ భారాన్ని మోస్తూ వచ్చామని అయితే , క్రమంగా పెరిగిపోతున్న ఈ చమురు ధరలు ఒకింత సంస్థ ఆర్థిక వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రయాణికుల చార్జీలపై డీజిల్ సెన్ విధించడం సంస్థకు అనివార్యమయ్యింద న్నారు.

ఈ నిర్ణయం సంస్థకు కొంత ఉపశమనం కల్గించడంతో పాటు ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవల్ని కొనసాగించ డానికి దోహద పడుతుందన్నారు. ఎంతోకాలంగా చౌకగా, సురక్షితంగా ప్రజా రవాణా సేవలను అందిస్తున్న ఆర్టీసి అనివార్య పరిస్థితుల్లో తీసుకున్న డీజిల్ సెస్ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకోని సహకరించాలని ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ విసి అండ్ ఎండి సజ్జనార్, ఐపిఎస్‌లు విజ్ఞప్తి చేశారు. ప్రజా రవాణా సేవల్ని అందిస్తున్న ఆర్టీసిని ఎప్పటి మాదిరిగానే ఆదరించాలని వారు కోరారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News