Monday, April 29, 2024

కారుతో బైక్ ను ఢీకొట్టిన నటి లహరి.. వ్యక్తికి గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ టీవి నటి లహరి కారు ఓ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి శంషాబాద్ లో చోటుచేసుకుంది. లహరి ఓ సీరియల్ షూటింగ్ లో పాల్గొని తిరిగి కారులో ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారుతోపాటు లహరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

TV Actress Lahari Car hit Bike at Shamshabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News