Monday, April 29, 2024

బస్సులో జన్మించిన ఇద్దరు శిశువులకు జీవితాంతం ఉచిత ప్రయాణం

- Advertisement -
- Advertisement -
Two baby girls born in moving TSRTC buses get free travel
ఆర్టీసి ఎండి సజ్జనార్ కీలక నిర్ణయం

హైదరాబాద్: ఆర్టీసి ఎండిగా ఐపిఎస్ ఆఫీసర్ విసి సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. దీంతో ప్రజారవాణాపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగి బస్సులో ప్రయాణించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో టిఎస్ ఆర్టీసిలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో నవంబర్ 30వ తేదీన నాగర్‌కర్నూల్, డిసెంబర్ 7న సిద్దిపేట దగ్గరలో ఇద్దరు గర్భిణులకు బస్సులోనే ప్రసవం జరిగింది. వెంటనే ఆర్టీసి సిబ్బంది 108కు ఫోన్ చేసి వారిని ఆసుపత్రులకు తరలించారు. దీనిపై స్పందించిన సజ్జనార్ ఇద్దరు శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకా కుండా బస్సులో జన్మించిన ఇద్దరు పిల్లలకు జీవితాంతం బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేందుకు పాస్‌లు అందించనున్నట్లు సజ్జనార్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News