Sunday, April 28, 2024

అంగారక గ్రహ చిత్రాన్ని పంపిన యుఎఇ వ్యోమనౌక హోప్

- Advertisement -
- Advertisement -

UAE spacecraft Hope sends Mars image

 

అరబ్ చరిత్రలో ఇది అపూర్వం

దుబాయ్ : అంగారక గ్రహానికి చేరుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన మానవ రహిత వ్యోమనౌక ‘హోప్’ అంగారక గ్రహం తాలూకు తన మొదటి చిత్రాలను పంపింది. నేషనల్ స్పేస్ ఏజెన్సీ ఈ వివరాలు వెల్లడించింది. సౌరవ్యవస్థ లోనే అత్యంత పెద్ద అగ్నిపర్వతంగా పేర్కొనే ఒలింపస్ మోన్స్ తెల్లవారు జామున సూర్యకాంతిలో ప్రతిబింబిస్తున్న దృశ్యం ఈ చిత్రాల్లో కనిపించింది. అంగారక కక్ష లోకి ప్రవేశించిన తరువాత మరునాడు అంగారక ఉపరితలానికి 24,700 కిమీ ఎత్తులో ఉండగా ఈ చిత్రాన్ని వ్యోమనౌక బుధవారం తీయ గలిగింది. అరబ్ ఎమిరేట్స్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టోమ్ ఈ రంగుల చిత్రాన్ని తన ట్విటర్ ద్వారా గ్రహించ గలిగారు. అరబ్ ఎమిరేట్ మొదటి వ్యోమనౌక అంగారకుని మొదటి చిత్రాన్ని తీయడం చారిత్రాత్మకంగా ఆయన అభివర్ణించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News