Monday, April 29, 2024

ఉక్రెయిన్‌కు నాటో ఎంట్రీ లేదు

- Advertisement -
- Advertisement -

విల్నియస్(లిథ్యూయేనియా): అత్యంత కీలకమైన నాటో కూటమిలోకి ఉక్రెయిన్‌కు ప్రవేశం దక్కలేదు. అయితే రష్యాతో యుద్ధం దిశలో ఉక్రెయిన్‌కు అన్ని విధాలుగా నాటో సహకరిస్తుంది. ఇక్కడ బుధవారం జరిగిన నాటో నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కల్పించడం లేదని, అయితే సాధ్యమైనంత స్థాయిలో ఉక్రెయిన్‌ను తమ సైనిక కూటమి దేశంగా మల్చుకుంటామని తెలిపారు.

ఉక్రెయిన్‌తో పటిష్ట సంబంధాల దిశలో ఓ అత్యున్నత స్థాయి ప్రతీకాత్మక నూతన వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు అంతర్గతంగా నాటోలో ఏర్పాటు అయిన నాటో ఉక్రెయిన్ మండలి సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీతో అమెరికా అధ్యక్షులు జోబైడెన్, ఇతర నాటో నేతలు సమావేశం అవుతారు. విల్నియస్‌లో జరిగిన నాటో భేటీకి జెలెన్‌స్కీ హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News