Saturday, May 11, 2024

శాంతి కృషిలో చైనాకు పెరుగుతున్న మద్దతు

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేసిన దేశాలలో ఫ్రాన్స్ ఒకటి, తన పొరుగు దేశానికి వ్యతిరేకంగా మాస్కో సైనిక చర్య ‘అకారణంగా జరిగింది’ అనే వాషింగ్టన్ వాదనకు మద్దతు ఇచ్చింది. అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై చేస్తున్న విస్తృత పరోక్ష యుద్ధంలో ఫ్రాన్సు భాగంగానే వుందని రష్యా భావిస్తోంది. ఉక్రెయిన్ తనదిగా చెప్పుకునే భూభాగాల్లో రష్యన్ దళాలు ఉన్నంత కాలం కాల్పుల విరమణ లేదా శాంతి చర్చలు సాధ్యం కాదని పదేపదే తోసి పుచ్చుతున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పదవిలో ఉన్నంత కాలం మాస్కోతో చర్చలు జరపడం చట్ట విరుద్ధం అన్న చట్టంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సంతకం చేశారు.

ఫ్రెంచ్ శాంతి ప్రణాళిక గురించి తమకు తెలియదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పగా, క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రిపెస్కోవ్ కూడా విలేకరులతో మాట్లాడుతూ మాక్రాన్ చొరవపై మాస్కో వద్ద ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వద్ద చైనా, ఫ్రెంచ్ నాయకుల మధ్య చర్చల తరువాత, రష్యా, ఉక్రెయిన్ రెండింటి ‘సహేతుకమైన భద్రతా ఆందోళనలను గౌరవించాలని చైనా నాయకుడు పునరుద్ఘాటించారు. అమెరికా ప్రతిపాదించిన ‘ఉక్రెయిన్ విజయం’ తీర్మానాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఉన్నత సలహాదారు మిఖాయిల్ పొడోలియాక్ ప్రశంసించారు. కీవ్‌ను నాటోలో చేర్చుకోవడం ద్వారా, దాని యుద్ధ లక్ష్యాలను ఆమోదించడం ద్వారా ‘చారిత్రక తప్పిదాన్ని’ సరిదిద్దుకోవడానికి వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
1994 బుడాపెస్ట్ మెమోరాండం ప్రకారం మాస్కోకు అణ్వాయుధాలను తిరిగి ఇవ్వడానికి ఉక్రెయిన్ అంగీకరించినందున మాస్కో నుండి రక్షించడానికి యుఎస్ బాధ్యత వహిస్తుందని కీవ్ చాలా సంవత్సరాలుగా ఆశిస్తోంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ నెల ప్రారంభంలో ఐరిష్ బ్రాడ్ కాస్టర్ ఆర్టీఈకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి క్షమాపణలు చెప్పారు. ఈ ఆయుధాగారం ఉక్రెయిన్‌ది కాదని, సోవియట్ యూనియన్‌కు చెందినదని, దీనికి రష్యా ఏకైక వారసుడిగా గుర్తించబడిందని పేర్కొంది. యు.ఎస్ విధానం ఉక్రెయిన్ 1991 సరిహద్దులను పునరుద్ధరిస్తుందని, రష్యా నష్టపరిహారం చెల్లించాలని, దాని నాయకత్వాన్ని యుద్ధ నేరాల కోసం విచారించాలని ప్రకటించింది. ఈ వివాదంలో తాము పాల్గొన లేదని అమెరికా వాదిస్తుంది, కానీ గత ఏడాదిలో కీవ్‌కు 100 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సైనిక సహాయాన్ని అందించింది. ఐరోపాలోని నాటో దళాల అమెరికా జనరల్ కమాండింగ్ జనరల్ క్రిస్టోఫర్కవోలి వాగ్దానం చేసిన యుద్ధ వాహనాల లో 98% ఇప్పటికే పంపిణీ చేయబడ్డాయని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుని సలహాదారు మిఖాయిల్ పొడోలియాక్ మాట్లాడుతూ ‘కౌంటర్ అఫెన్సివ్’ కోసం ఉక్రెయిన్‌కు ఇంకా మరిన్ని ఆయుధాలు, పరికరాలు అవసరం అంటాడు.

ఎదురుదాడి విఫలమైతే ఉక్రెయిన్ పాశ్చాత్య మద్దతు కోల్పోయే ప్రమాదం వుందని న్యూయార్క్ టైమ్స్ హెచ్చరిస్తోంది. ఈ నిరాశాజనక పరిణామం కీవ్ మద్దతుదారులను శాంతి కోసం చర్చలు జరిపేందుకు ఒత్తిడి చేస్తోందని ఆ వార్తాపత్రిక అంచనావేసింది. పెంటగాన్ లీక్స్‌లో భాగంగా పంచుకున్న రహస్య పత్రాల ప్రకారం యు.ఎస్, దాని మిత్ర దేశాలు తొమ్మిది యూనిట్లకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడ్డాయి, సైనికులకు పాశ్చాత్య దేశాలు అందించిన పరికరాలను ఉపయోగించడం, జర్మనీలోని అమెరికన్ సైనిక సౌకర్యాలలో వ్యూహాత్మక సలహాలను స్వీకరించడం నేర్పించారు. ఉక్రెయిన్ మద్దతుదారులు ప్రతిపాదిత దాడి కోసం ఇంటెలిజెన్స్‌ను కూడా అందించాలని భావిస్తున్నారు. ఈ విధంగా నాటో కూటమి యుద్ధం కొనసాగేలా ఏర్పా ట్లు చేస్తున్నది. చైనా మొదటి నుంచి రష్యా, ఉక్రెయిన్ సహా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇతర యూరోపియన్ శక్తులతో మంచి సంబంధాలను, మాటామంతీ కొనసాగిస్తోంది. అమెరికాతోను, బ్రెజిల్ వంటి ఇతర వర్ధమాన శక్తులతో కూడా సమాచారం మార్పిడి చేసుకుంటోంది.

అందువల్ల సంఘర్షణలో శాంతియుత పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించ గలుగుతోంది. అమెరికా, పాశ్చాత్య దేశాలలో కొందరు ప్రతిపాదించిన ‘ద్వంద్వ’ విధానానికి భిన్నంగా, చైనా తూర్పు జ్ఞానంతో నిండిన భిన్నమైన మార్గాన్ని అందిస్తున్నది. చైనా- ఉక్రెయిన్ సంక్షోభ సృష్టికర్తా కాదు, భాగస్వామీ కాదు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా, బాధ్యతాయుతమైన ప్రధాన శక్తిగా, ఉక్రెయిన్ సంక్షోభానికి రాజకీయ పరిష్కారాన్ని ప్రోత్సహించాలనే చైనా నిజాయితీగా, నిస్వార్థంగా ఆకాంక్షిస్తోంది. శాంతి, చర్చలు, చరిత్రలో సరైన పక్షాన దృఢంగా నిలబడటం చైనా విధానం. ఇప్పుడు, శాంతినీ, చర్చలను ప్రోత్సహించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను రష్యా, ఉక్రెయిన్ రెండూ స్వాగతించాయి. ఫ్రాన్స్, జర్మనీ వంటి ఐరోపా శక్తులు, అలాగే యూరప్ యూనియన్ నాయకులు కూడా శాంతి చర్చలను ప్రోత్సహించడంలో చైనా ఇంకా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని చైనా సంక్లిష్టమైన, విడదీయడానికి కష్టమైన చిక్కుముడిలా చూస్తోంది సంక్లిష్టమైన వైరుధ్యాలను క్రమేపీ విచ్ఛిన్నం చేస్తూ,

ఓపికగా, స్థిరంగా సమస్య కేంద్ర బిందువును చేరుకోవడానికి అపారమైన రాజకీయ జ్ఞానం, సహనం పట్టుదల అవసరం. వాస్తవానికి, కాలం గడుస్తున్న కొద్దీ, రష్యా, ఉక్రెయిన్, అలాగే ఐరోపాలోని ఇతరులతో సహా అనేక దేశాలు చైనా ప్రతిపాదిత పరిష్కారాన్ని క్రమంగా గుర్తించాయి లేదా పాక్షికంగా అంగీకరించాయి. ‘చైనా స్వరాన్నిప్రపంచం వినాలి’ అని చెప్పే గొంతులు అమెరికాలో కూడా పెరుగుతున్నాయి. చైనా, ఉక్రెయిన్ నేతల మధ్య సమావేశం అనంతరం శ్వేతసౌధం కూడా ఈ పిలుపును స్వాగతిస్తూ ఇది మంచిదే అనకతప్పలేదు. రష్యా -ఉక్రెయిన్ వివాదం మొదలైనప్పటి నుంచి అమెరికా, కొన్ని పాశ్చాత్యదేశాలు చైనాపై బురద చల్లి, వారిని కించపరిచే ప్రయత్నం లో వదంతులు సృష్టిస్తున్నాయని గమనించాలి. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, అవి వీగిపోయి వారికే స్వీయ -ఓటమిని కలిగిస్తున్నాయి. శాంతి నిర్మాణ దారుగా చైనా గుర్తింపు పెరుగుతోంది. చైనా అన్ని పక్షాలతో నేరుగా సంభాషించ గలుగుతోంది. ఏకాభిప్రాయాన్ని, సానుకూల ప్రతిస్పందనలను పొందగలుగుతోంది. ఈ పాత్రను, ప్రభావాన్ని నేటి ప్రపంచంలో వేరెవరూ భర్తీ చేయలేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News