Saturday, April 27, 2024

రెండు పొరబాట్లు చేశా

- Advertisement -
- Advertisement -

Umpire Steve Bucknor is remorseful

 

ఆ రెండు సార్లూ బలయింది సచినే
దిగ్గజ క్రికెటర్ అంపైర్ స్టీవ్ బక్నర్ పశ్చాత్తాపం

న్యూఢిల్లీ : క్రికెట్ ప్రపంచ దిగ్గజ అంపైర్లలో ఒకడైన స్టీవ్ బక్నర్ మైదానంలో తాను తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయాల వల్ల నిద్ర లేని రాత్రులు గడిపానని చెప్పాడు. రెండు సార్లు తాను తీసుకున్న పొరపాటు నిర్ణయాలను ఆయన గుర్తు చేసుకున్నాడు. రెండు సందర్భాల్లోకూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ బలయ్యాడని చెప్పాడు. అయితే ఈ రెండూ కూడా పొరపాటు నిర్ణయాలని వెల్లడించాడు. మాన్సన్స్ అండ్ గెస్ట్ రేడియో కార్యక్రమంలో బక్నర్ ఆ నాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు.‘ 2003 గాబాటెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ జేసన్ గిలెప్సీ వేసిన బంతికి తెండూల్కర్ ఎల్‌బిగా వెనుదిరిగాడు. అయితే బంతి వికెటపైనుంచి చాలా ఎత్తులో వెళ్తున్నట్లు రీప్లేలో తేలింది.

మరోసారి 2005 కోల్‌కతా వన్డేలో పాక్ బౌలర్ అబ్దుల్ రజాక్ వేసిన బంతికి సచిన్‌ను క్యాచ్‌ఔట్‌గా ప్రకటించా. కానీ తర్వాత తెలిసింది, అది బ్యాట్‌కు తగలనే లేదని. మనుషులన్నాక పొరపాట్లు సహజం. అయితే వాటిని అంగీకరించాలి. ఏ అంపైర్ కూడా తప్పుడు నిర్ణ్ణయాలు కావాలని తీసుకోడు. ఈడెన్ గార్డెన్‌లో కిక్కిరిన అభిమానుల హర్షధ్వానాలే రెండో తప్పుకు కారణమని భావిస్తున్నా. లక్షమంది ఆ మ్యాచ్‌ను వీక్షిస్తుండడంతో బంతి బ్యాట్‌కు తగిలిందీ లేనిదీ గ్రహించలేకపోయా.నా పొరపాట్లకు చింతిస్తున్నా. వాటివల్లే నా కెరీర్ ప్రమాదంలో పడవచ్చని అనుకుంటున్నా.

పొరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు’ అని బక్నర్ అన్నాడు. ఇక క్రికెట్‌లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, డిఆర్‌ఎస్ పద్ధతి పొరపాటు నిర్ణయాలను సమీక్షించుకోవడానికి చక్కని అవకాశాలు కల్పించాయన్నారు.అవి అంపైరింగ్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పలేను కానీ నిర్ణయాల్లో కచ్చితత్వాన్ని తెస్తాయని మాత్రం చెప్పగలనని బక్నర్ అన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News