Monday, May 6, 2024

జయహో రామప్ప

- Advertisement -
- Advertisement -

జయహో రామప్ప

రసమయ శిలాసృష్టి.. అనుపమ కళావృష్టి

ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు

మహాశిల్పి రామప్ప నిర్మించిన అత్యద్భుత శిల్ప సంపదకు కాణాచి అయిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్ సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్ప దేవాలయానికి మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లా పాలంపేటలో క్రీ.శ.1213లో రామప్ప ఆలయం నిర్మాణం కాగా దీనికి సుమారుగా 800 ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించగా, శిల్పి రామప్ప పేరుతో ఈ కాకతీయ కట్టడం ప్రాచుర్యంలోకి వచ్చింది.

అద్భుతం. ప్రతి ఒక్కరికి అభినందనలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు. కాకతీయ శిల్పకళా వైభవానికి తార్కాణంగా నిలిచిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుతున్న దేమిటంటే ఆ గంభీరమైన ఆలయ ప్రాంగణాన్ని దర్శించుకొని, గొప్పతనాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొని అద్భుతమైన అనుభవాన్ని గడించండి- ప్రధాని మోడీ

కాకతీయుల సృజనాత్మక శిల్ప కళా నైపుణ్యం తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపదలోనే ప్రత్యేకమైనది. తెలంగాణ చారిత్రక, ఆధ్యాత్మిక ఉన్నతి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోన్నది. రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం మద్దతు తెలిపిన సభ్య దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కృషి చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అభినందనలు-సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: అత్యద్భుత శిల్ప సంపదకు చిరునామాగా నిలిచిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్ సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్ప దేవాలయానికి మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లా పాలంపేటలో క్రీ.శ.1213లో రామప్ప ఆలయం నిర్మా ణం కాగా దీనికి సుమారుగా 800ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించగా, శిల్పి రామప్ప పేరుతో ఈ కాకతీయ కట్టడం ప్రాచుర్యంలోకి వచ్చింది.
అడ్డుకున్న నార్వే…. మద్ధతు తెలిపిన రష్యా
పాలంపేటలో రామప్ప ఆలయాన్ని 13 శతాబ్దంలో నిర్మించారు. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల డాక్యూమెంట్లను యునెస్కోకు పంపింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వాటిని పరిశీలించిన కమిటీ రామప్ప దేవాలయానికి వారసత్వ హోదాను కట్టబెట్టింది. ఈ విషయంలో నార్వే అడ్డుకునేందుకు ప్రయత్నించగా రష్యా భారత్ కు సపోర్ట్ చేసింది. భారతదేశం నుంచి 1983లో అజంతా, ఎల్లోరా, ఆగ్రా కోట, తాజ్ మహాల్ లకు తొలిసారిగా యునెస్కో గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా 38 ప్రదేశాలకు ఈ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ హోదా లభించిన ప్రాంత చారిత్రక, ప్రాకృతిక ప్రాధాన్యాన్ని కాపాడేందుకు ఆ సంస్థ తగిన చర్యలు తీసుకుంటుంది.
దేశ, విదేశాల నుంచి పర్యాటకులు
యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాలను చూడటానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులూ వస్తాయి. అంతేకాదు, పర్యాటకంగానూ ఎనలేని ప్రచారం లభిస్తుంది. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా, రామప్ప గుడిని మరో పది తరాల వరకు చెక్కుచెదరకుండా కాపాడుకునే అవకాశం లభిస్తుంది. మధ్యయుగపు రాచఠీవిని, అప్పటి వాస్తు శిల్ప వైవిధ్యాన్నీ, నాటి శిల్పుల హస్తకళా నైపుణాన్ని ఆవిష్కరించేదే రామప్ప ఆలయం.
పునరుద్ధరణ ప్రయత్నాలు
రామప్ప ఆలయాలను కట్టించిన రేచర్ల రుద్రుడు ఇక్కడ వేయించిన శాసనంలో ఓ అరుదైన ప్రతిపాదన చేశాడు. ఎవరికైనా తాము శత్రువులు అయితే కావచ్చు కానీ, ఆలయం కాదనీ, దీన్ని ధ్వంసం చేయరాదనీ అభ్యర్థించాడు. కాపాడాల్సిన బాధ్యత ఉన్నవాళ్లు ఆలయ బాగోగులు పట్టించుకోలేకపోతే పదివేల జన్మలు పేడలో పురుగులుగా పుడతారని శాపం రాయించాడు. అయితే, సుమారు వంద సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం నవాబు రామప్ప ఆలయాలను పునరుద్ధరించేందుకు పూనుకున్నారు. నిజాం ప్రభుత్వంలో 1914లో ఏర్పడిన పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ రామప్ప ఆలయ పునరుద్ధరణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. బలహీనంగా ఉన్న పైకప్పు పటిష్టత కోసం రాతి దూలాలను ఏర్పాటు చేయించారు. తర్వాతి కాలంలో భారత పురావస్తు శాఖ ఆలయ శిఖరాన్ని పునర్నిర్మించి పైకప్పును బాగు చేయించింది. ఆలయ పునాదుల్లోకి వాన నీరు ఇంకకుండా ప్లాస్టరింగ్ చేయించింది.

UNESCO Recognition to Ramappa Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News