Monday, April 29, 2024

కృష్ణలో వరద ఉధృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కష్ణానది ఉపనదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కృష్ణానదిలో వరద ఉధృతి మరింతగా పెరిగింది. ఆల్మట్టి జలాశయంలోకి ఎగువనుంచి 3లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా ప్రాజెక్టులో 44శాతం కుషన్ ఉంచి ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టే బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిలువ 129టిఎంసిలకుగాను, నిలువను 72.23టిఎంలకు పరిమితం చేశారు. దిగువన నారాయణపూర్ జలాశయానికి 2,93,000క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, గేట్లు తెరిచి 2,88,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జారాల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 4,04,230 క్యూసెక్కులనీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 64శాతానికి పరిమితం చేశారు. పవర్‌హస్ ద్వారా 10,331 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా 3.18లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తన్నారు. మరో 1641క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలంకు 40టిఎంసిల వరద:
ఎగువనుంచి శ్రీశైలంలోకి భారీగా వరదనీరు చేరుతోంది.ఆదివారం ఏకంగా 40టిఎంసిలనీరు చేరినట్టు అధికారులు వెల్లడించారు. ఇటు కృష్ణానది నుంచి అటు తుంగభద్ర నదినుంచి శ్రీశైలం జలాశయంలొకి మొత్తం 4,04,230క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ఎడమగట్టు పవర్‌హౌస్ ద్వారా 30,078క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు దిగువన నదిలోకి విడుదల చేస్తున్నారు.మరో 1600క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885అడుగులకు గాను ,864.60అడుగులకు చేరుకుంది.జలాయంలో పూర్తి స్థాయి 215టిఎంసిల నీటినిలువకుగాను ఇప్పటికే120.95టిఎంసిల నీరు నిలువ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే శ్రీశైలం జలాశయం మరో మూడు రోజుల్లోనే పూర్తి స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దిగువన నాగార్జున సాగర్ జలాశయంలోకి ఎగువ నుంచి31184క్యూసెక్కుల నీరు చేరుతుండగా ప్రాజెక్టులో నీటిమట్టం 538అడుగులకు చేరుకుంది. నీటినిలువ 184.18టిఎంసిలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.దిగువన పులిచింతల జలాశయం ఇప్పటికేపూర్తి స్థాయిలో నిండిపోవటంతో ఎగువ నుంచి వస్తున్న 13800 క్యూసెక్కుల నీటిని వచ్చింది వచ్చినట్టేదిగువకు విడుదల చేస్తున్నారు. మూసి నదిలో 4901క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.మూసి ప్రాజెక్టులో నీటినిలువను 57శాతానికి పరిమితం చేసి 3262క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.
తుంగభద్రలో 88టిఎంసిలు:
ఎగువనుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్రలో నీటిమట్టం గణనీయంగా పెరుగింది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులకు గాను ఆదివారం 1629.70 అడుగులకు చేరింది. ఎగువనుంచి 1,81,660 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు గేట్లు తెరిచి 46,598 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో పూర్తిస్థాయి 100.86 టిఎంసిల నీటి నిలువకుగాను 88 టిఎంసిల వద్ద నీటి నిలువను పరిమితం చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు దిగువన అధికారులు నదీపరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

గోదావరిలో వరద తగ్గుముఖం:
ఎగువన మహారాష్ట్రలో వర్షాలు ఆగిపోవటంతో గోదావరి నదిలో వరదనీటి ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయి. శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఎగువనుంచి నీటిప్రవాహం 29770క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్టు అన్నిగేట్లు మూసివేశారు. పవర్‌హౌస్‌ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 8000క్యూసెక్కుల నీటిని వడుదల చేస్తున్నారు. జలాశంలో 90.31 టిఎంసిల పూర్తిస్థాయి నీటినిలువకుగాను 83.77టిఎంసిల నీరు నిలువ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి 46917క్యూసెక్కుల నీరు చేరుతుండగా, జలాశయంనుంచి 31470క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో నీటినిలువను 87శాతానికి పరిమితం చేశారు. కడెం ప్రాజెక్టులోకి 3635క్యూసెక్కుల నీరు చేరుతుండగా, జలాశయం నుంచి 12135 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.మిడ్‌మానేరులోకి 170క్యూసెక్కులు, లోయర్ మానేరులోకి 1272క్యూసెక్కుల నీరు చేరుకుంటోంది.
సింగూరులో 68శాతం నీరు:
మంజీరా నదిలో నీటిప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. సింగూరు ప్రాజెక్టులోకి ఎగువనుంచి 3325క్యూసెక్కులనీరు చేరుతుండగా, జలాశయంలో నీటినిలువ 68శాతానికి పెరిగినట్టు అధికారులు తెలిపారు.నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువనుంచి 2070 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయంలో పూర్తిస్థాయి నీటినిలువ 17.80 టిఎంసిలకుగాను ఇప్పటివరకూ 10.13 టిఎంసిల నీరు చేరుకుంది.

Heavy Flood flow into Krishna River

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News