Monday, April 29, 2024

ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పల్లెబాటకు అనూహ్య స్పందన

- Advertisement -
- Advertisement -

పూడూరు: పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి చేపట్టిన పల్లెబాట కార్యక్రమానికి ప్రజల నుంచి అనుష్య స్పందన లభిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ ఫథకాలు గ్రామాలలో పూర్తి స్థాయి లో అమలు అవుతున్నాయని బ్రహ్మా రథం పడుతున్నారు.

ఎమ్మెల్యే మహేశన్న పల్లె బాట పూడూరు మండలంలోని మంచన్‌పల్లి, గట్టుపల్లి, తుర్కఎన్కెపల్లి, నిజాంపేట్‌మేడిపల్లి, చింతలపల్లి, కంకల్, పుడిగుర్తి,పెద్దఉమెంతాలు గ్రామ పంచాయతీలో రెండవ రోజు ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన గ్రామాలలో జెండాలను ఎగరవేసి ప్రధాన వీధుల గుండా కార్యకర్తల మద్య డప్పు వాయిద్యాలతో ప్రజల సమస్యలను తెలుసుకుంటు, ప్రభుత్వం పథకాల లబ్దిదారులతో ముచ్చటిస్తు కార్యకర్తల మద్య రేగింపూలు కొనసాగాయి. పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. శంకుస్థాపనలు చేశారు.

తుర్కఎన్కెపల్లిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామానికి రూ. 20 లక్షల నిధులతో సిసి రోడ్లు, అండర్ డ్రైనేజీలు చేయించామన్నారు. రూ.10 లక్షలతో వేసిన సిసి రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు. డంపింగ్ యార్డు పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్ మంజూరు, వైకుంఠదామం, వర్మీకంపోస్ట్ షెడ్ వంటి అనేక అభివృద్ది పనులు చేపట్టామని తెలిపారు. తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ది పనులకు దేశం గర్విస్తుందని అన్నారు.

మన రాష్ట్ర పథకాలను ఇతర రాష్ట్రాలు దర్శంగా తీసుకుని అక్కడ అమలు చేస్తున్నాయని చెప్పారు. తుర్కన్కెపల్లిలో మిషన్ భగీరథ వాటర్ సరఫరా కావడం లేదని సర్పంచ్ జ్యోతి రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే సంబందిత అధికారికి ఫోన్ చేసి అడిగారు. ఈ గ్రామం పైప్‌లైన్ కింది బాగంలో ఉన్నందుకు నీళ్లు రావడం లేదని వారు సమాదానం చెప్పారు. గ్రామంలో ధరణీ సమస్యలు అధికంగా ఉన్నాయని వీటిని వెంటనే పరిష్కరించాలని అడిగారు. రెండ వందల నుంచి మూడు వందల వరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పగా ఎమ్మెల్యే స్పందించి ఈ నెల 22న రైతులు సమస్యలపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి మల్లేశం, జడ్‌పిటిసి మేఘమాల, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ రాజేందర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఎండీ.అజారోద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News