Monday, April 29, 2024

యూపిఎస్సీ సివిల్ మెయిన్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్- 2023 ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ అధికారిక వెబ్ సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చని పేర్కొంది. అడ్మిట్ కార్డు నెంబరు నమోదు చేయడం ద్వారా ఫలితాలు చూసుకోవడంతో పాటు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలను సెప్టెంబరు 15 నుంచి 24 వరకు నిర్వహించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి సర్వీసుల కోసం దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు త్వరలో ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News