Sunday, April 28, 2024

ఇరాక్, సిరియాల్లో అమెరికా ప్రతీకార దాడులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఇటీవల జోర్డాన్ లో అమెరికా సైనిక శిబిరంపై జరిగిన డ్రోన్ దాడికి అగ్రరాజ్యం ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరాక్ ,సిరియా లోని ఇరాన్ మద్దతు కలిగిన మిలిటెంట్లు, ఇరాన్ రివల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్షంగా చేసుకుని యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తాము ఘర్షణలను కోరుకోవడం లేదని, కానీ అమెరికన్లకు హాని కలిగిస్తే ప్రతిచర్య ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు. రానున్నరోజుల్లో తమ టార్గెట్లపై మరిన్ని భీకర దాడులు ఉంటాయని హెచ్చరించారు. ఈ దాడులను ఇరాక్ మిలిటరీ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తింది.

అయితే ఇరాక్ ప్రభుత్వానికి ముందే సమాచారమిచ్చామని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. జోర్డాన్‌లో ఇటీవల అమెరికా సైనిక శిబిరంపై డ్రోన్ దాడి జరగడంతో ముగ్గురు సైనికులు మృతి చెందారు. దీనిపై అమెరికా ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరాక్, సిరియా ల్లోని 85 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. సిరియాలో జరిపిన దాడుల్లో 18 మంది ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు మరణించినట్టు యూకె లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. ఇరాక్ లోనూ పలు మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News