Saturday, April 27, 2024

దళిత అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఆపై హత్య … ఆరుగురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Uttar Pradesh Dalit sisters rape and murder

లఖింపూర్‌ఖేరి : ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్‌ఖేరిలో బుధవారం ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లను అత్యాచారం చేసి, ఆ తరువాత హత్య చేసిన సంఘటన సంచలనం కలిగింది. ఈ ఘటనకు సంబంధించి అటాప్సీ రిపోర్టు కూడా బయటకు వచ్చింది. బాధితుల్ని అత్యాచారం చేసి హత్య చేసినట్టు అటాప్సీ నివేదికలో తేల్చారు. అక్కాచెల్లెళ్లను చెట్టుకు ఉరివేసి వేలాడదీసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులు చోటూ, జువైద్, సుహాల్, కరీముద్దీన్, ఆరిఫ్, హఫీజ్ లను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత కుటుంబానికి భౌతిక కాయాలను అప్పగించినట్టు అదనపు డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ సంఘటనలో హంతకులను కఠినంగా శిక్షిస్తామని, రాబోయే తరాలు సైతం వణికిపోయే విధంగా వీరిని శిక్షిస్తామని యూపీ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ గురువారం వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లఖింపూర్ జిల్లాలో ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్లపై కొందరు దుండగులు అత్యాచారం చేసి వారిని చెట్టుకు ఉరివేసి హత్య చేశారు. వీరిద్దరి మృతదేహాలను బుధవారం గుర్తించారు. అక్కచెల్లెళ్లు ఇద్దరికీ నిందితులతో బాగా పరిచయం ఉందని, ఇష్టపూర్వకంగానే నిందితులతో కలిసి మోటార్ సైకిళ్లపై వెళ్లారని పోలీసులు చెప్పారు. కానీ బాధిత కుటుంబీకులు మాత్రం తమ కుమార్తెలను నిందితులు అపహరించి తీసుకెళ్లారని ఆరోపించారు. నిందితుల్లో జువైద్ ,సుహాల్ బుధవారం ఆ బాలికల ఇంటికి వెళ్లి మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లారని, తమను పెళ్లి చేసుకోవాలని బాలికలు నిందితులిద్దరినీ కోరడంతో వారిపై అత్యాచారం చేసి, ఉరితీసి చంపేశారని లఖింపూర్ పోలీస్ సూపరెంటెండెంట్ సంజీవ్ సుమన్ చెప్పారు. బాలికల పొరుగింట్లో ఉన్న ఛోటు అనే నిందితుడే మిగిలిన నిందితులకు ఈ బాలికలను పరిచయం చేశాడని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News