Sunday, April 28, 2024

ఉత్తరాఖండ్ హిమపాతం: అదృశ్యమైన వారిలో నలుగురి జాడ గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Uttarakhand avalanche: Traces of four missing persons

 

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ లోని చమోలి ప్రాంతంలో శుక్రవారం సంభవించిన హిమపాతానికి గల్లంతైన పర్వతారోహక బృందం కోసం గాలిస్తుండగా త్రిశూల్ పర్వతం దగ్గర నలుగురు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని గమనించారు. త్రిశూల్ పర్వతాన్ని అధిరోహించేందుకు వచ్చిన నేవీ బృందం లోని ఆరుగురు కనిపించకుండా పోవడంతో రిలీఫ్‌రిస్కూ టీములు రంగం లోకి దిగాయి. వీరికి సహాయంగా ఆర్మీ, ఎయిర్‌ఫోర్సు , ఎస్టీర్‌ఎఫ్ సిబ్బంది కూడా గాలింపు చేపట్టారు. హెలికాప్టర్‌తో గాలిస్తుండగా త్రిశూల్ పర్వతం వద్ద నలుగురు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని రిస్కూటీం గుర్తించింది. బహుశా వారు పర్వతారోహక బృందం వారేనని భావిస్తున్నారు. అయితే వారికి దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్‌తో వెళ్ల లేక పోతున్నామని రేపటికి చేరుకోడానికి ప్రయత్నిస్తున్నామని నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్‌ఐఎం) ప్రిన్సిపాల్ అమిత్ బిషత్ చెప్పారు. బాగేశ్వర్ జిల్లా పశ్చిమకుమాన్ ప్రాంతం లోని 7,120 మీటర్ల ఎత్తున త్రిశూల్ పర్వతాన్ని శుక్రవారం నేవీ బృందం అధిరోహిస్తుండగా హిమపాతంతో ఆరుగురు అదృశ్యమయ్యారు. వీరిలో ఐదుగురు నేవీ సిబ్బంది కాగా ఒకరు ఒక కూలీ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News