Monday, April 29, 2024

ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద్రసింగ్ రావత్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Uttarakhand CM Trivendra Singh Rawat resigns

గైర్‌సైణ్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ మంగళవారం రాజీనామా చేశారు. త్రివేంద్రసింగ్ రావత్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందించారు. రావత్ పై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బిజెపి అధిష్ఠానం ఆదేశంతో రావత్ రాజీనామా చేసినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రావత్ రాజీనామాతో ఉత్తరాఖండ్ రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్ లో  బిజెపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయ్యాయి. సొంత పార్టీ ఎంఎల్ఎలే రావత్ పనితీరు, ఆయన నిర్ణయాలపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఉత్తరాఖండ్ తదుపరి సిఎం ఎవరనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిఎం రేసులో అజయ్ భట్, అనిల్, ధన్ సింగ్ రావత్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News