Monday, April 29, 2024

ప్రవాస భారతీయులకు సంప్రదాయ వంటకాలు

- Advertisement -
- Advertisement -

ప్రత్యేకంగా దేశీ అథెంటిక్ ఏర్పాట్లు

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారికి దక్షిణ భారతీయ వంటకాలను ఇంటి వద్దకే అందిస్తున్నామని దేశీ అథెంటిక్ వ్యవస్థాపకుడు, సిఈఓ రామ్‌వేమిరెడ్డి అన్నారు. దేశీ అథెంటిక్ మూడో వార్షికోత్సవం పురస్కరించుకొని శనివారం బేగంపేట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంస్థ ప్రతినిధులు సౌరభ్ రామ్‌దొరై, ఉగంధర్ సబ్బినేని,వరప్రసాద్ సూరికూచితో కలిసి ఆయన మాట్లాడారు. యుఎస్‌ఎతో పాటు 210 దేశాల్లో స్థిరపడిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలకు తెలుగు సంస్కృతికి అద్దం పట్టే సంప్రదాయ వంటకాలు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, సీజన్ వారీగా ప్రకృతి అందించే వాటిని అర్డర్ చేసిన నాలుగు రోజుల్లో అందజేస్తున్నామని అన్నారు.

ప్రవాసాంధ్రులు వారి దేశాల్లో గృహప్రవేశం, వార్షికోత్సవాలు, వివాహాలు, సారె వంటి కార్యక్రమాలకు దేశీ అథెంటిక్ వంటకాలను అందజేస్తుందన్నారు. విదేశాల్లో శుభ కార్యక్రమాలకు హైదరాబాద్ నుంచి అందిస్తున్నట్లు తెలిపారు.వడియాలు, పాపడ్, సకినాలు, అరిసెలు, చేగోడీలు, అన్నమయ్య లడ్డూ, గోంగూర పచ్చడి, మురుకులు, అటుకుల మిశ్రమం, చికెన్ ఊరగాయ, పల్లి పొడి, ఇడ్లీ కారం పొడితో పాటు 170 రకాల రుచులను అందిస్తున్నట్లు తెలిపారు. దేశీ అథెంటిక్ ప్రధానంగా దేశీ కళలు, హస్తకళలు, చేనేత, సాంస్కృతిక సాహిత్యం, పాత ఆటల సామగ్రిని ప్రవాసాంధ్రుల ఇంటికి చేర్చేందుకు వారధిగా నిలుస్తుందన్నారు. ఆన్‌లైన్ వేదికగా మూడు సంవత్సరాల్లో ప్రవాస భారతీయ 38 వేల కుటుంబాలకు హైదరాబాద్ నుంచి వంటకాలను అందజేశామని తెలిపారు.

ప్రతి నెలా 10 వేల కిలోల ఆహార పదార్థాలతో విదేశాలకు పంపించడంతో 2.8 కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. www.desiauthentic.comలో ఆర్డర్ చేసిన వెంటనే నాలుగు రోజుల్లో విదేశాల్లో ఉన్నవారికి తెలుగు, దక్షిణ భారతీయ సంప్రదాయ వంటకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వంటకాలను నేరుగా తయారు చేసే మహిళల నుంచి సేకరించి.. విదేశాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. శాకాహారి, మంసాహారి వంటకాలను దేశీ అంథెటిక్ అందిస్తునట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News