Wednesday, May 8, 2024

కరోనా ఎఫెక్ట్.. టమాట @70

- Advertisement -
- Advertisement -

Vegetable

 

హైదరాబాద్ : వ్యాపారులకు ఎప్పుడూ వ్యాపార ప్రయోజనాలే కాని ప్రజాప్రయోజనాలు ఏ మాత్రం పట్టవని మరో సారి రుజువైంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధిచేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర వస్తువులైన కూరగయాలు, పాల ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా నగరంలోని కూరగాయల వ్యాపారులు కూరల ధరలను ఒక్కసారిగా పెంచారు. బహిరంగ మార్కెట్‌లలోనే అనుకుంటే రైతు బజార్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జనతా కర్ఫ్యూ ఆదివారం జనాలు అంతా ఇంటికి పరిమితమయ్యారు. వైరస్ విజృంబణ మరింతగా పెగడంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ నెల 31వరకు లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో వ్యాపారులు ఒక్క సారిగా కూరగాయాల ధరలను అమాంతంగా పెంచివేశారు. సోమవారం నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనేందుకు పెద్ద ఎత్తున బజార్లు చేరుకున్నారు.

దీంతో నగరంలోని రైతు బజార్లన్నీ జనాలతో కిక్కిరిసి పోయాయి.. ఇదే అదునుగా బావించిన వ్యాపారులు కూరగాయల ధరలను అమాతంగా పెంచివేశారు. దీంతో వ్యాపారులు కొనుగోలు దారుల మధ్యవాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఇంత జరుగుతున్నా ధరలను నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారే కాని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను అందుబాటు ధరలో ఉంచుతామని ప్రభుత్వ భరోసా ఇచ్చిన వ్యాపారులు దోపిడిని ఆపడంలో అధికారులు విఫలమయ్యారని వారు మండి పడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందోనని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నైనా అధికారులు ఈ అంశపై ప్రత్యేక దృష్టి సారించి అధిక ధరలకు కూరగాయలను విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కూరగయాలు                 ఇదివరకు ధరలు                                   ప్రస్తుత ధరలు
టమాట కిలో                         రూ. 9.00                                        రూ . 70.00
వంకాయల కిలో                     రూ . 13.00                                      రూ . 80.00
బెండకాయ కిలో                     రూ . 25.00                                      రూ. 60.00
కాకర కాయ కిలో                    రూ . 31.00                                      రూ. 80.00
బీరకాయ కిలో                       రూ . 25.00                                      రూ . 55.00
దొండకాయ కిలో                     రూ . 19.00                                      రూ. 45.00
క్యాప్సికం కిలో                       రూ . 30.00                                      రూ. 80.00
క్యారెట్ కిలో                         రూ . 20.00                                       రూ. 85.00
మిర్చి కిలో                          రూ . 25.00                                       రూ. 90.00
క్యాబేజి కిలో కిలో                   రూ . 7.00                                         రూ. 40.00

 

Vegetable Prices are hiked
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News