Monday, April 29, 2024

మండుతున్న కూరగాయల ధరలు

- Advertisement -
- Advertisement -

Vegetable prices are rising in Hyderabad

అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి

హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ధరలు మండుతున్నాయి. అకాల వర్షాలు , అధిక వర్షాలతో కూరగాయ పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల పంట ఉత్పత్తులు తగ్గటంతో ఆ ప్రభావం ధరలపై చూపుతోంది.కరోనా ప్రభావం , లాక్‌డౌన్ సమస్యలతో గత ఏడాది కూరగాయలు సాగు చేసిన రైతులు పంటను గిట్టుబాటు ధరలకు విక్రయించుకోలేక నష్టపోయారు.ఈ ఏడాది కరోనా ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ అధికవర్షాలు కూరగాయల రైతులను నిలువునా ముంచాయి. దీనికితోడు రైతుల వద్ద కూరగాయల ధరలు తొక్కిపెట్టి మార్కెట్లో మాత్రం వాటిని అధిక ధరలకు విక్రయించి మధ్యదళారులు ,వ్యాపారులు సోమ్ము చేసుకొంటున్నారు. తగిన ధరరాక ఇటు కూరగాయలు పండించిన రైతులు, అధిక ధరల ప్రభావంతో అటు వినియోగదారలు నష్టపోతున్నారు. గత నెల రోజుల నుంచి కూరగాయల ధరలు పెరుగూతూనే వస్తున్నాయి.

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కూరగయాల ధరల నియంత్రణపై అధికారులు తీసుకొంటున్న చర్యలు అంతగా ఫలితాలను ఇవ్వటం లేదు. రాష్ట్రంలో రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , మేడ్చెల్ , యాదాద్రి భువనగిరి , మహబూబ్ నగర్ నల్లగొండ ,తదితర జిల్లాల్లో గత ఏడాది 17వేల ఎకరాల్లో కూరగాయ పంటలు సాగు చేయగా , ఈ సారి కూరగాయల సాగు 14వేల ఎకరాలకు మించలేదు. ఒకవైపు కూరగాయ పంటల సాగు విస్తీర్ణం తగ్గటం , మరో వైపు అధిక వర్షాలతో దిగుబడి తగ్గటంతో ఈ ్రప్రభావం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలతో టమాటా , క్యారెట్ , చిక్కుడు, క్యాబేజి ,బీన్స్ , సోర, బీర, కాకర తదతర పంటలు దెబ్బతిన్నాయి. ఆకు కూర పంటలు కూడా అతివృష్టి కారణంగా దెబ్బతిన్నాయి. కూరగాయల ఉత్పత్తి తగ్గటం వల్ల పెరిగిన డిమాండ్‌తోపాటు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నడీజిల్ ధరలు కూడా రవాణ రంగంపై ప్రభావం చూపుతున్నాయి.

కూరగాయలను రైతుల పొలానుంచి ప్రధాన మార్కెట్లకు చేరవేసేందుకు రవాణ ఖర్చులు ఇదివరకటి కంటే 15శాతం పెరిగినట్టు చెబుతున్నారు. రైతుబజార్లలో విక్రయించే కూరగాలయ ధరల కంటే తోపుడు బండ్లపై కూరగాయలు విక్రయించే వీధి వ్యాపారుల వద్ద కూరగయాల ధరలు కిలోకు పది రూపాయలు అధికంగా వుంటున్నాయి. వర్షాలతో బూజుపట్టి నల్లగా మారి అంతగా నాణ్యత లేని ఉల్లిగడ్డలు సైతం కిలో రూ. 25కు తగ్గటం లేదు. మంగళవారం మార్కెట్లలో కూరగాయల ధరలు చిక్కుడు రూ.60, బీన్స్ రూ.60 గోరుచిక్కుడు రూ.40, టమాటా రూ.30, క్యాప్సికం రూ.70, బీరకాయ రూ.40, సొరకాయ రూ.40, వంకాయ రూ.35,దోసకాయ రూ.20 ఆలుగడ్డ రూ.24, దొసకాయ రూ.20, ఆకు కూరలు కోతిమిర కట్ట రూ.10, గోంగూర రూ.8,పాలకూర , మెంతికూర , కట్ల రూ.10 ధర పలికింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News