Monday, April 29, 2024

నారాయణపేట జిల్లాలో హై టెన్షన్

- Advertisement -
- Advertisement -

మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో వెలసిన జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దాని కంపెనీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు నిరసనలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా వెలవడె వ్యర్థాల వల్ల నీరు, భూగర్భ జలాలు అన్ని కలిషితమైపోతున్నాయని ఈ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. నిన్న రాత్రి ఈ కంపెనీ నుండి వ్యర్థాలతో వెళ్తున్న ట్యాంకర్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు.

ఈ వ్యర్థాలను పరీక్షిస్తే దాంట్లో ఉన్న రసాయనాలు తెలుస్తాయని దాని వల్ల తమకు హాని ఎంత ఉందో తెలుస్తోందని నిన్న రాత్రి నుండి ఆ వాహనాన్ని అడ్డుకొని రహదారిపై నిరసన తెలుపుతున్నారు. ఆదివారం ఉదయం స్థానిక సిఐ రాంలాల్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడడానికి ప్రయత్నించగా వాళ్ళు వినకపోవడంతో బలవంతంగా వాహనం తీసుకెళ్లడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహంతో పోలీసులపై తిరగబడి పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. ఒక వాహనాన్ని దగ్ధం చేశారు. గ్రామస్తులు విసిరిన రాళ్లకు స్థానిక సీఐ రాంలాల్ కు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జితో గ్రామస్తులకు గాయాలయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు ఆగ్రహంతో కనిపించిన పోలీసులను తమ ఇళ్లలో వేసి తాళాలు వేశారు. ఈ కంపెనీ మూసి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు నిరసన చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News