Saturday, April 27, 2024

హింసాత్మక హిందూ జాతీయవాదం!

- Advertisement -
- Advertisement -

భారత ప్రధాని నరేంద్రమోడీ, ప్రపంచ కుబేరుడు గౌతవ్‌ు ఆదాని ఇద్దరూ ఒకరి ఎదుగుదలతో మరొకరు లబ్ధి పొందారు. వారిద్దరి అనుబంధం ఇప్పుడు పరిశీలనలో ఉంది. భారత దేశం విదేశీ శక్తుల దాడికి గురవుతోంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ ఈ దాడి చేస్తున్నాయి. మన ప్రభుత్వాన్ని మనం నమ్మాలి, ఎందుకు? మన అదృష్టాన్ని, మన ఎదుగుదలను ఒకప్పటి వలసపాలకులు, నవీన సామ్రాజ్యవాదులు సహించలేక పోతున్నారు. మన జాతి రాజకీయాలపైన, మన ఆర్థిక వ్యవస్థ పైన దాడి జరుగుతోంది.

‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ అన్న పేరుతో జనవరిలో బిబిసి డాక్యుమెంరీని రెండు భాగాలుగా విడుదల చేయడం ద్వారా కోవర్టు ఆపరేషన్‌కు దిగింది. అమెరికాకు చెందిన నాథన్ అండర్‌సన్ ఆధ్వర్యంలో హిండెన్‌బర్గ్ నివేదిక దీనిక తోడైంది. ప్రధాని నరేంద్ర మోడీ, ప్రపంచంలో మూడవ అతి పెద్ద కుబేరుడు గౌతవ్‌ు ఆదాని అనే రెండు పెద్ద టవర్లపైన దాడి చేయడం తప్ప మరేమీ కాదని బిబిసి, హిండెన్ బర్గ్ చర్యలను టీవీలు తూర్పారబట్టాయి. వారిద్దరికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు అంత చిన్నవేమీ కావు. సామూహిక హత్యాకాండకు మోడీ ప్రేరేపించినట్టు బిబిసి పేర్కొంది.

జనవరి 24వ తేదీన ప్రచురించిన హిండెన్ బర్గ్ నివేదికలో ఆదాని ‘కార్పొరేట్ చరిత్రలో అతి పెద్ద నమ్మకద్రోహాని’కి పాల్పడినట్టు పేర్కొంది. ఈ ఆరోపణలను ఆదాని గ్రూపు తీవ్రంగా ఖండించింది. మోడీ, ఆదాని దశాబ్దాలుగా ఒకరికొకరు తెలిసిన వారే. ఒక రైల్వే బోగీలో ఉన్న 59 మంది హిందూ యాత్రికులను సజీవ దహంచేసిన సంఘటనలో ముస్లింలనే బాధ్యులను చేస్తూ, గుజరాత్‌లో 2002లో ముస్లింలకు వ్యతిరేకంగా మారణకాండ జరిగింది. ఇది జరగడానికి కొన్ని నెలల ముందే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఆ సమయంలో దీనికి ప్రతీకారేచ్ఛగా హైందవ ముఠాలు బహిరంగంగా ముస్లింలను సామాహికంగా హత్య చేసి, వారి స్త్రీలపై అత్యాచారం చేశాయి.

కొందరు పాత కాలపు పారిశ్రామిక వేత్తలు మోడీ చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గుజరాత్‌కు చెంది కొందరు పారిశ్రామిక వేత్తలు ‘తలెత్తిన గుజరాత్ సమూహం’ అన్న పేరుతో ఏకమయ్యారు. మోడీపైన విమర్శలు చేసేవారిని ఖండిస్తూ, మోడీ ‘హిందువుల హృదయ సామ్రాట్టు’ అని, హిందూ ఓటు బ్యాంకును నిలబెట్టే మహానుభావుడిగా కీర్తించాయి. వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన మోడీ 2014లో భారతప్రధానిగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి ఆదాని పేరున్న విమానంలో మోడీ వచ్చారు. తొమ్మిదేళ్ళ మోడీ పాలనతో ఆదాని సంపద 8 బిలియన్ డాలర్ల నుంచి 137 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఒక్క 2022లోనే ఆయనకు 72 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. ప్రపంచంలో అతి పెద్ద కుబేరుల్లో తొమ్మిది మంది ఆదాయానికి ఇది సమానం.

ఆదాని గ్రూపు ఆధ్వర్యంలో డజను ఓడరేవులున్నాయి. భారతీయ ఓడరేవుల్లో ఇవి 30 శాతం. వారి ఆధ్వర్యంలో ఉన్న ఏడు ఎయిర్ పోర్టులలోని భారత వైమానిక ప్రయాణికుల్లో 23 శాతం మంది ప్రయాణిస్తుంటారు. ఆదాని గ్రూపు గిడ్డంగులలో 30 శాతం భారత ఆహార ధాన్యాలు ఉన్నాయి. దేశంలో ఉన్న ప్రైవేటు విద్యుదుత్పత్తి కేంద్రాలో సింహభాగం ఆదాని గ్రూపువే. గుజరాత్ తరహా అభివృద్ధికి ఇది నమూనా. “తొలుత ఆదాని విమానంలో మోడీప్రయాణించారు” “ఇప్పుడు మోడీ విమానంలో ఆదాని ప్రయాణిస్తున్నారు” ఇప్పుడు రెండు విమానాల ఇంజన్లు ఇబ్బందిలో పడ్డాయి.

వారిరువురు చుట్టుకున్న భారత జాతీయ పతాకం నుంచి బయటపడాతారా!? ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ అన్న బిబిసి డాక్యుమెంటరీ 2002లో జరిగిన గుజరాత్ హత్యాకాండకు సంబంధించింది. (ఆడాక్యుమెంటరీలో నేను కూడా ఉన్నాను). ఇది కేవలం హత్యలకు పరిమితమైంది కాదు. అనేక మంది బాధితులు న్యాయం జరుగుతుందనే రాజకీయ జవాబుదారి తనంపైన ఒక నమ్మకంతో, రెండు దశాబ్దాల ప్రయాణంలో భారతీయ చట్టమనేచట్రంలో చిక్కుకుపోయారు. ఆ రోజుల్లో గుజరాత్‌లో జరిగిన ఊచకోతలో భాగమైన గుల్‌బార్గ్ సొసైైటి ఊచకోతకు ప్రత్యక్ష సాక్షి ఇంతియాజ్ పఠాన్ తన కుంటుంబంలో పదిమందిని కోల్పోయాడు. కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు ఎహెషాన్ జాఫ్రీ ఇంటి ముందర అల్లరి మూక ఉండగా వారింట్లో తాము ఎలా తలదాచుకున్నది పఠాన్ వివరించాడు.

సహాయం చేయమని నరేంద్ర మోడీకి ఫోన్‌చేసినా స్పందన లేదు. జాఫ్రీ బైటికొచ్చేసి తన రక్షణ కోసం వచ్చిన వారిని ఒదిలేయమని వేడుకొన్నాడు. కానీ, అతని శరీరం గుర్తుపట్టరానివిధంగా కాల్చేశారు. గంటల తరబడి మారణ ెమం కొనసాగింది. కేసు విచారణ సందర్భంగా ప్రత్యక్ష సాక్షి పఠాన్‌ను తప్పించి, అనేక మంది సాక్షులను ప్రవేశ పెట్టారు. ఈ విషయాన్ని బిబిసి స్పష్టంగా చెప్పింది. తన భర్త హత్య వెనుక ఒక పెద్ద కుట్ర దాగుందని ఎహెషాన్‌జాఫ్రీ సతీమణి జాకియా జాఫ్రి పెట్టుకున్న పిటీషన్‌ను 2022లో సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ‘కేసును తప్పుదోవ పట్టించేదిగా’ ఉందని ఆమె ఫిర్యాదుపై న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలా తప్పుదోవ పట్టించిన వారిని ప్రాసిక్యూట్ చేయమని ఆదేశించింది. మోడీ నిర్దోషి అని వచ్చిన తీర్పు వెలువడిన రోజున ఆయన మద్దతు దారులు సంబరాలు జరుపుకున్నారు. ఆడుక్యుమెంటరీలో మోడీ పాత సహచరుడు, ెం మంత్రి అమిత్‌షా ఇంటర్వ్యూ కూడా ఉంది. గత 19 ఏళ్ళుగా ‘విషాన్ని కంఠంలో దాచుకున్న శివుడు’ అని మోడీని ఆయన పోల్చారు. మోడీ నిర్దోషి అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పాక ‘బంగారంలో నిజాలు మెరుస్తూ వచ్చాయి’ అని అమిత్‌షా వ్యాఖ్యానించారు.

బ్రిటిష్ విదేశీ కార్యాలయం 2002 ఏప్రిల్‌లో జారీ చేసిన అంతర్గత నివేదిక గురించి భారత ప్రభుత్వం చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రజల వద్దకు చేరలేదు. కనీసం రెండు వేల మంది హత్యకు గురైనట్టు ఈ నిజనిర్ధారణ కమిటీ పేర్కొంది. ముందస్తు పథకం ప్రకారమే ఈ మారణ ెమం జరిగిందని స్పష్టం చేసింది. ఈ మారణెమం జరుగుతున్నప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నివేదికలోని ఆరోపణ మోడీ గడపతొక్కింది. ఈ నిజనిర్ధారణ పరిశోధనలో బ్రిటిష్ రాయబారి కూడా కెమెరాకు వెనుక అజ్ఞాతంగా ఉన్నారు. ప్రధానిగా మోడీ తన పాలనాకాలంలో పెంచి పోషించిన ప్రమాదకరమైన మత విభజనను బిబిసి డాక్యుమెంటరీ రెండవ భాగంలో చూస్తే చాలా భయమేస్తుంది. కత్తులుపుచ్చుకుని గుంపులు గుంపులుగా తిరగడం, కాషాయం ధరించిన దేవుడు, ముస్లిం మహిళలను మానభంగం చేయమని, ముస్లింలను చంపేయమని పిలుపునివ్వడం, ముస్లింలను వీధుల్లోనే కొట్టడం చాలా మంది భారతీయులు గమనిస్తున్నదే. ఇలా చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించి, వారికి మోడీ మంత్రిమండలిలోని సభ్యులు పూల దండలు వేసి అభినందించారు.

IT attacks on 'BBC'

నిజానికి ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ అన్న డాక్యుమెంటరీని బ్రిటిష్‌పౌరుల కోసం తయారు చేసింది. వీటిని చూసిన వారు యుట్యూబ్‌లోను, ట్విట్టర్‌లోను పోస్ట్ చేశారు. అది ఇంటర్‌నెట్‌ను అంటించింది. ఈ వీడియోలను డౌన్‌లోడ్‌చేసుకోకూడదని, చూడకూడదని హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ వీడియోను సామూహికంగా చూస్తున్నప్పుడు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కొన్ని చోట్ల పోలీసులు వచ్చి ఈ వీడియో చూడడాన్ని అడ్డుకున్నారు. ఈ వీడియో లింకులను అప్‌లోడ్ చేయరాదని, చూడరాదని ట్వీట్టర్, యూ ట్యూబ్‌లను ప్రభుత్వం ఆదేశించింది. దీనిపైన ఫిర్యాదులు వచ్చాయి. “ఈవీడియోను ఎందుకు నిషేదిస్తున్నారు? గుజరాత్ మారణెమమే ఆయనకు సాయం చేసింది. మనం ఎన్నికల సంవత్సరంలో ఉన్నాం” అని ముస్లిం స్నేహితులు కొందరన్నారు.
రెండవ టవర్ పైన దాడి

బిబిసి రెండవ భాగం ప్రసారం జరిగిన రోజునే 400 పేజీల హిండెన్ బర్గ్ నివేదిక కూడా వచ్చేసింది. భారతీయ జన్నలిస్టులు గతంలో లేవనెత్తిన ప్రశ్నలనే వివరంగా ఇస్తూ ముందుకు సాగింది. ఆదాని గ్రూపు డబ్బా కంపెనీలతో “తప్పుడు లెక్కల పథకాలు”, కృత్రిమంగా తమ కంపెనీ షేర్ విలువలను పెంచేయడంతోపాటు లాభాలను ఎక్కువగా చూపించింది. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం ఏడు ఆదాని కంపెనీ విలువను 85 శాతం పైగా పెంచేశారు. ఈ విలువలను ఆధారం చేసుకుని అంతర్జాతీయ మార్కెట్ నుంచి, లక్షలాదిమంది సామాన్యులు దాచుకున్న సొమ్మును స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి భారతీయ పబ్లిక్ రంగం నుంచి బిలియన్ల డాలర్లను పొందింది. హిండెన్ బర్గ్ నివేదిక నిరాధారమని, హానికరమైనదని, ఇది భారత దేశంపైన చేసే దాడి అని ఆదాని గ్రూపు విడుదల చేసిన 413 పేజీల ఖండనలో పేర్కొంది. మదుపు దారులను ఇది సంతృప్తి పరచలేకపోయింది. హిండెన్ బర్గ్ నివేదిక మార్కెట్‌ను తాకింది. ఫలితంగా ఆదాని గ్రూపు 110 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూచింది. క్రెడిట్ సుసి, సిటిగ్రూప్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటివన్నీ ఆదాని బాండ్లను ఆంగీకరించలేదు. ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ నాలుగు బిలియన్ డాలర్ల గ్రీన్ హైడ్రోజన్ వెంచర్‌ను నిలిపివేసింది.

బంగ్లాదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో పునరాలోచనలో పడింది. ఆదాని గ్రూపుతో ముడిపడి న లండన్‌కు చెందిన ఎలరా క్యాపిటల్ డైరెక్టర్‌గా ఉన్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సోదరుడు, జో జాన్‌సన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. హిండెన్‌బర్గ్ నివేదిక పైన జాయంట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలని ప్రతిపక్షాలు కోరడంతో రాజకీయ దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ, త్రిణమూల్ కాగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయం లేవనెత్తారు. “తన షేర్ ెల్డర్ల్‌లో ఒకరు వెల్లడించడానికి తిరస్కరించినప్పుడు ఓడరేవులు, విమానాశ్రయాల నిర్వహణకు “ఎ” గ్రూపునకు ెం మంత్రి ఎలా సెక్యూరిటీ అనుమతి ఇస్తారు?” అని మొయిత్రా ప్రశ్నించారు. ఆరు మార్షియస్ గ్రూపుల నుంచి అయిదు బిలియన్ డాలర్ల విదేశీ నిధులు ఒకే కంపెనీ అడ్రసు నుంచి, ఒకే సెక్రెటరీ నుంచి ఎలా సేకరిస్తారు? ఈగ్రూపులో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు ఆ గ్రూపులో ఎలా పెట్టుబడులు కొనసాగిస్తాయి? “ఆదానీకి కాంట్రాక్ట్ లభించడానికి ప్రధాన మంత్రి ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి ఎన్ని దేశాలకు ప్రయాణం చేశారు?” అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇజ్రాయిల్‌తో రక్షణ కాంట్రాక్ట్, ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల కోసం, బంగ్లాదేశ్‌కు 1500 మెగావాట్ల విద్యుత్ విద్యుదుత్పత్తి కోసం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బిలియన్ డాలర్ల రుణం తీసుకున్న జాబితాను రాహుల్ గాంధీ గుర్తుచేశారు.

ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఆదాని గ్రూపు రహస్యంగా బీజేపీకి ఎంత ముట్టిందని ప్రశ్నించారు.
ఇది మధ్యలో విషయం. కార్పొరేట్ శక్తులు రాజకీయపార్టీలకు రహస్యంగా నిధులు ఇచ్చే ఎలక్ట్రొరల్ బాండ్లను బిజేపీ 2016లో ప్రవేశ పెట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుల్లో ఆదాని ఒకరు కాగా, ప్రపంచంలో అత్యంత ధనిక పార్టీ బీజేపీ. ఈ పాత స్నేహితులు ఎప్పుడైనా తమ లెక్కల పుస్తకాలను మనకు చూపిస్తారా? వాటికి ప్రత్యేకమైన లెక్కల పుస్తకం ఏమైనా ఉందా? మొయిత్రా లేవనెత్తిన ప్రశ్నలను పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలను రికార్డుల నుంచి తొలగించారు. తన గురించి భారతీయులు సగర్వంగా చెప్పుకుంటారని, అంతర్జాతీయ కుట్రకు తాను బాధితుడినని, ఆ కుట్ర ఎప్పటికీ విజయవంతం కాదని, ఎందుకంటే నూట నలభై కోట్ల మంది భారతీయులు తనకు విశ్వసనీయ రక్షణగా ఉన్నారని, ప్రతిపక్షాలకు అది ఎప్పటికీ సాధ్యం కాదని మోడీ తనప్రసంగంలో పేర్కొన్నారు. ప్రతి మాటలో వ్యంగం, ఎగతాళి ధ్వనించేలా మాట్లాడారు ఆయన ప్రతి మాటకు బిజేపీ సభ్యులు “మోడీ! మోడీ! మోడీ!” అంటూ బల్లలు చరిచారు.
బీజేపీ ఎన్నికల గుర్తు కమలంపైన ఎంత బురద చల్లుతారో అది అంతగా వికసిస్తుంది అన్నారు. తన ప్రసంగంలో ఆదాని పేరును ఒక్క సారి కూడా ఉచ్ఛరించలేదు.

ఇది చర్చ అన్న విషయం నమ్మక పోవచ్చు కానీ, కోట్లాదిమంది తన ఓటర్లు నిరుద్యోగులు, వంద బిలియన్ డాలర్లంటే ఏమిటో తెలియని వారు, మోడీ ఫోటో ముద్రించిన రేషన్ సరుకుల సంచితో జీవించే పేదరికంలో మగ్గేవారు. మోడీ ఉపయోగించిన పదాల గొప్పదనాన్ని భారతదేశంలో మీడియా కీర్తించింది. అదే రోజు మరొక పెట్టుబడుల సదస్సు జరగబోతున్నట్టు మోడీ పెద్ద ఫొటోతో అన్ని పత్రికల మొదటి పేజీలో ప్రకటనలు వెలువడ్డాయి. తరువాత కొద్ది రోజులకు ఫిబ్రవరి 14వ తేదీన ెం మంత్రి ఆదాని విషయం గురించి ఇచ్చిన ఇంర్వ్యూలో “దాచడానికి, భయపడడానికి కానీ ఏమీ లేదు.” అని వ్యాఖ్యానించారు. సంయుక్త పార్లమెంటరీ సమావేశాన్ని తిరస్కరిస్తూ, ప్రతిపక్షాలు అవసరం అనుకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చన్నారు. ఆయన పత్రికలవారితో మాట్లాడుతున్న సమయంలోనే పోలీసులరక్షణలో, ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు చేశారు, ఆదాని కార్యాలయాలపైన కాదు, బిబిసి పైన.
మర్నాడు ఫిబ్రవరి 15న వార్తల ధోరణి మారిపోయింది. నవీన సామ్రాజ్యవాద దాడి పైన వార్తలు మొదలయ్యాయి. తరువాత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జియోబైడె ్‌సమావేశం జరిగింది. భారతదేశం 470 బోయింగ్ విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు ఇరువురు ప్రకటించారు. ఈ ఒప్పందం ఫలితంగా అమెరికాలో పదిలక్షల ఉద్యోగాలు లభిస్తాయి. ఆ విమానాలకు రోల్స్ రాయిస్ ఇంజన్ ఉంటుంది. ‘వైమానిక రంగం వల్ల బ్రిటన్ అభివృద్ధిచెందుతోంది’ అని రిషి సునక్ ప్రకటించారు. అభివృద్ధికి ఆకాశమే హద్దు అన్నారు. డబ్బు, రక్తం నిండిన చిత్తడి నేలలో కమలం వికసిస్తుంది. సత్యం తప్పకుండా బంగారంలా మెరుస్తుంది.

(‘ద గార్డియన్’లో వచ్చిన అరుంధతీ రాయ్ వ్యాసానికి అనువాదం)

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News