Sunday, April 28, 2024

గ్యాస్ పవర్ ప్లాంట్ పై మాటల యుద్ధం

- Advertisement -
- Advertisement -

నేదునూరు పవర్‌ప్లాంట్‌ను బిఆర్‌ఎస్ విస్మరించింది
అన్ని అనుమతులూ అప్పట్లోనే సాధించాం : పొన్నం
గ్యాస్ కేటాయింపు లేకపోవడంవల్లే చేపట్టలేకపోయాం
ఇప్పుడు మీదే ప్రభుత్వం.. మీరు పూర్తి చేయండి
కరెంట్ కష్టాలకు కాంగ్రెస్సే కారణం : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులపై కెటిఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. శ్వేతప్రతం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతకానితనాన్ని బయటపెట్టుకుందని ఆరోపించారు. నేదునూరు, శంకర్‌పల్లి ప్రాజెక్టులకు కేంద్రం గ్యాస్ కేటాయించకపోవడం వల్లే ప్రాజెక్టులు చేపట్టలేకపోయాం అని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని అన్నారు. నీళ్లు, బొగ్గు లేని రాయలసీమలో, బొగ్గు లేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్రాలు నెలకొల్పుతారని, తెలంగాణలో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు కట్టకుండా, రాష్ట్రం ఏర్పడే నాటికి 27 వందల మెగావాట్ల లోటు నష్టాలతో తమకు అప్పజెప్పారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. శాసనసభలో విద్యుత్ రంగ పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడారు. 55 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిర్వాకాన్ని వైట్ పేపర్‌లో చాలా గొప్పగా స్పష్టంగా చెప్పింది.

మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే 2014 నాటికి ఆరు గంటల కరెంట్ మాత్రమే ఇచ్చామని, అంతటి అసమర్థత, చేతకానితనం మాది అని వారే ఒప్పుకున్నారని తెలిపారు. కడపలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం పెట్టారు. అక్కడ బొగ్గు ఉందా? నీళ్లు ఉన్నాయా? విజయవాడలో బొగ్గు ఉందా? ఇవాళ బాగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు కట్టకుండా, రాష్ట్రం ఏర్పడే నాటికి 27 వందల మెగావాట్ల లోటు నష్టాలతో తమకు అప్పజెప్పారు. మానకొండూ రు నియోజకవర్గంలోని నేదునూరు, చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లిలో ఆనాడు యూపిఎ ప్రభుత్వం గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని భూసేకరణ చేశారని, టిఆర్‌ఎస్ పార్టీగా ఆనాడు ఒక్క దగ్గర ధర్నా చేయలేదని, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న గ్యాస్ ఆధారిత కేంద్రాలు ఎందుకు పెట్టడం లేదు అని నిరసన వ్యక్తం చేశారని, బొగ్గు లేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్రం ఎందుకు పెడతారు? బొగ్గు, నీళ్లు లేని రాయలసీమలో ఎందుకు పెడుతారు? అని నాడు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ బిడ్డలుగా గట్టిగా కొట్లాడినం, నిరసనలు వ్యక్తం చేశాం అని కెటిఆర్ స్పష్టం చేశారు.

మంత్రి పొన్నం ఏమన్నారంటే..?
నేదునూరు పవర్ ప్లాంట్ కోసం తెలంగాణ ఉద్యమం తీవ్రతరంగా ఉన్న సమయంలో కూడా తీవ్రంగా కృషి చేశామని, పదేళ్లు తెలంగాణ ను పాలించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం పవర్ ప్లాంట్‌ను ఎందుకు పూర్తి చేయలేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ‘ మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం నేదునూరులో గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టు ను 2100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం గా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంజూరు చేశారు. మొదటి దశలో 700 మెగా వాట్ల ప్లాంట్ నిర్మా ణానికి 2010 ఫిబ్రవరి 14 న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య శంఖు స్థాపన చేశారు. రూ.13 కోట్లతో 432 ఎకరాలు భూ సేకరణ చేసి, అన్ని అనుమతులు పొందినా అనుమతి తీసుకోలేదు, ప్రాజెక్టు పూర్తి కాలేదు’ అన్నారు.

Ponnam Prabhakar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News