Wednesday, November 6, 2024

భారత్‌కు వెంటిలేటర్లు, ఇతర పరికరాలు అందిస్తాం: కెనడా

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: భారత్‌కు అవసరమైన వైద్య పరికరాలు అందించేందుకు కెనడా కూడా సిద్ధమైంది. క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు సహాయపడేందుకు కెనడా ప్రభుత్వం సంకల్పంతో ఉన్నదని ఆ దేశ ప్రజాసేవల మంత్రి అనితా ఆనంద్ తెలిపారు. భారత్‌కు ఉపయోగపడే పిపిఇ కిట్లు, వెంటిలేటర్లు, ఇతర పరికరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. భారత మూలాలున్న అనిత, సహాయం ఏ విధంగా ఉండాలనేదానిపై ఢిల్లీలోని తమ రాయబారి నాదిర్‌పాటిల్ చర్చిస్తున్నారని తెలిపారు. మా స్నేహ దేశానికి సహాయమందించేందుకు సిద్ధంగా ఉన్నామని కెనడా విదేశాంగశాఖ కూడా ట్విట్ చేసింది.

We supply ventilators to India: Canada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News