Friday, May 3, 2024

సమ్మర్ సెలవులను ప్రకటించిన బెంగాల్ సర్కార్

- Advertisement -
- Advertisement -

West Bengal govt declares summer holidays

కోల్‌కతా: దేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న తరుణంలో  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏప్రిల్ 20 నుండి పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. విద్యార్థుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ సోమవారం తెలిపారు. 9, 10, 11, 12 విద్యార్థులకు తరగతులు ఫిబ్రవరి మధ్య నుండి తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ, కోవిడ్-19 కారణంగా తాము వేసవి సెలవులను ముందస్తుగా ప్రకటించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు కూడా ఈ ఉత్తర్వులను అనుసరించాలని చటర్జీ ఆదేశించారు. గత రెండు నెలల్లో పాఠశాలల్లో చాలా మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. పది, ఇంటర్ పరీక్షలను నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. గత 24 గంటల్లో పశ్చిమబెంగాల్ లో 7,000 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ ను నియంత్రించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని, ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని ఆదివారం సిఎం మమత డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News