Monday, April 29, 2024

10 హెచ్ పి మోటర్లు ఎవరు కొనిస్తరు?

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కెసిఆర్ సూటి ప్రశ్న

రాష్ట్రంలో రైతుల వద్ద ఉన్నవి మూడు లేదా ఐదు హెచ్‌పి మోటర్లే

30లక్షల 10హెచ్‌పి మోటర్లు కావాలి

ఇంత శక్తివంతమైన మోటర్లను నడిపితే బోర్లలో నీళ్లు ఉంటయా?
కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
దుర్మార్గపు కాంగ్రెస్ గెలిస్తే ఆగమాగమే

రైతుబంధు దుబారా అన్నవాళ్లను తరిమికొట్టాలి

50ఏళ్ల పాలనలో తాగునీరు.. సాగునీరు ఎందుకివ్వలేదు?

పాలకుర్తి, నాగార్జున సాగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో
జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో బిఆర్‌ఎస్ అధినేత

మనతెలంగాణ/వరంగల్‌బ్యూరో/హాలియా/ఇబ్రహీంపట్న: ‘వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని రైతులు 10హెచ్‌పి మోటార్లు పెట్టుకుంటే మూడు ఎకరాలకు నీరు పారుతుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఈ 10హెచ్‌పి మోటార్లను ఎవరు కొనియ్యాలే’ అని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిసిసి సారథిని సూటిగా ప్ర శ్నించారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండల కేంద్రం, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఖానాపూర్ గేటు వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన బిఆర్‌ఎ స్ ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభకు సిఎం కెసిఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘పిసిసి అధ్యక్షుడే 3 గంటల కరెంటుంచాలని బల్ల గుద్ది చెబుతున్నడు. ఏం తెల్వది.. హెచ్‌పి మోటర్ ను రైతులు పెట్టుకుంటే గంటకు ఎకరం పొలం పారుతది..మూడు గంటలు చాలు అంటుండు. రైతుల దగ్గర 10 హెచ్‌పి మోటర్ ఉంటదా? రైతులకు ఉండేదే 3 హెచ్ పి, 5 హెచ్‌పి మోటర్లు. మరి 10 హెచ్‌పి మోటర్లు ఎవరు కొనియ్యాలె? రాష్ర్టంలో చట్టబద్ధంగా 30 లక్షల మోటర్లు ఉంటే.. అదనంగా మరో రెండు, మూడు లక్షల మోటర్లు ఉంటయ్. వీటన్నింటికీ 10 హెచ్‌పి మోటర్లు కొనాలంటే ఎవరు కొనాలె? 10 హెచ్‌పి మోటర్లతో నీళ్లు గుంజితే బోర్లల్లో నీళ్లుంటాయా?’ అని తొర్రూరులో నిలదీశారు. కాంగ్రెస్ గెలిస్తే దుర్మార్గపు పాలన వస్తుందని, అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రం కోసమే బిఆర్‌ఎస్ పార్టీ పుట్టిందని అన్నారు. ప్రపంచంలోనే రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చిన ఏకైక పార్టీ బిఆర్‌ఎస్ అన్నారు. అలాంటి రైతుబంధును మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవం త్ రెడ్డిలు విమర్శిస్తున్నారని, కెసిఆర్ నిధులను దుబారా చేస్తున్నారని అంటున్నారని నిజంగా రైతుబంధు దుబారా అవుతున్నదా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ధరణి పోర్ట ల్ ను బంగాళాఖాతంలో వేస్తానన్న టిపిసిసి అధ్యక్షుడు రేవం త్ రెడ్డి రైతులకు రైతుబంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ధర ణి పోర్టల్ ద్వారా రైతులకు నేరుగా ఖాతాలో డబ్బులు పడుతున్నాయని, ధరణిని తీసివేస్తే ఏ లెక్క ప్రకారం రైతుబంధు ఇస్తారని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ వల్ల రైతుకే యాజమాన్య హక్కులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ధర ణి పోర్టల్‌ను రద్దు చేస్తే మళ్లీ పాత పద్ధ్దతిలో రెవెన్యూ యం త్రాంగం రైతులను పిక్కు తినడం ఖాయమని, అంతేకాకుండా రైతులు తమ భూమి హక్కులు కూడా కోల్పోతారన్నారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో రైతుల గురించి మాట్లాడుతున్న రేవం త్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రైతులు ఆగం అవుతారని దీనిపై రైతులు ఆలోచించాలన్నారు.

ఇక్కడ చెప్పిన విషయాలు ఇక్కడే వదిలేయకుండా గ్రామాలలో రచ్చబండ వద్ద ఎవ రూ మంచి చేస్తున్నారు, ఎవరూ చెడు చేస్తున్నారో అనేది చర్చ పెట్టాలన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం మం చినీ ళ్లు ఇచ్చిన గతుందా అని విమర్శించారు. కాంగ్రెస్ పరిపాలన లో దళితులు, గిరిజనులను ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నారన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత బంధుతో వారి ఆత్మగౌరవాన్ని పెంచిందని, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ తె చ్చి తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చే య డం జరిగిందన్నారు. దాని ఫలితంగా గిరిజనులు మాతండా లో మా రాజ్యం అని స్వయంపాలన చేసుకుంటున్నారని అన్నారు. మంత్రి దయాకర్‌రావు పంచాయతీ రాజ్ శాఖ మం త్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారన్నారు. తండాలను పంచాయతీలుగా చేయడమే కాకుండా సాగునీరు, తాగునీరు, రోడ్లు, సీసీ రోడ్లు వేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారన్నారు.

ఇంత అభివృద్ధి జరిగినా ప్రతి గ్రామానికి 100 డబుల్ బెడ్‌రూంలు ఇండ్లు మంజూరు చేయాలని కోరారని వచ్చే ప్రభుత్వంలో ఆ హామీని నెరవేర్చుతామని, కాళేశ్వరం, ఎస్సారెస్పీ, దేవాదుల నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని, ఆ నీటి నిల్వకోసం మరిన్ని చెక్‌డ్యాంలు కావాలని అడిగారన్నారు. అవసరమైన చోట చెక్‌డ్యాములు కూడా భారీ ఎత్తున నిర్మించి చెరువులు కుంటలను కూడా నింపారన్నారు. అందుకే ఎర్రబెల్లి దయాకర్ రావును డ్యాములు రావుగా పిలుస్తామని సిఎం కెసిఆర్ చమత్కరించారు. పోతన, బందగీ, చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణ సాయుధ పోరాట యోదులు పుట్టిన గడ్డని వారిని స్ఫూర్తిగా తీసుకుని వివేకంతో ఓటు వేయాలన్నారు. లక్షలాదిగా తరలి వచ్చిన బిఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలతో ఈ సభ దయాకర్ రావును భారీ మెజార్టీతో గెలిపిస్తున్నదన్నారు.
బిఆర్‌ఎస్ గెలుపును ఎవడూ ఆపలేరు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ ఆపలేడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాలియాలో స్పష్టం చేశారు. గత కాంగ్రెస్ పాలనలో రూ.200 పె న్షన్ మొఖాన కొట్టారు. మొదట రూ.1000 చేసి ఇవాళ రూ.2వేల పెన్షన్ చేసింది ఎవరు? ఓన్లీ బీఆర్‌ఎస్ గవర్నమెంట్ అని కెసిఆర్ తెలిపారు. ఇవాళ మళ్లీ రూ.5వేల పెన్షన్ పెంచుతామని ప్రకటించామని భగత్‌ను గెలిపించండి అందరి పెన్షన్లు రూ.5వేలకు పెరుగుతాయని కెసిఆర్ అన్నారు. ఎవరు మంచి చేస్తరు, ఎవరు చెడు చేస్తరు అనే ఆలోచన చేయాలని ఆలోచన చేయకుండా ఆగమాగం ఓట్లు వేయొద్దు’ అని సూచించారు. ‘ప్రజలందరికీ ఈ విషయం ప్రజలకు తెలిసేలా బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కెసిఆర్ కోరారు. మీ గ్రామాల్లో చర్చ పెట్టి ఏది నిజం.. ఏది రాయి.. ఏది రత్నమో చర్చపెట్టి ఓట్లు వేయించాలని కెసిఆర్ సూచించారు.

భగత్ భారీ ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని దేశంలో ఎక్కడైనా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేశారా అని ఆలోచన చేయాలని కోరు. ‘పొరపాటున కాంగ్రెస్ వస్తే క రెంటు పోవడం ఖాయం.. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్. ఎవడు ఎక్కడపోతడో తెలియదు. వాళ్ల చేతిలో రాజ్యం పడితే వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లే అయితది. ఆలోచించి ఓటు వేయాలి. మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ప్రజల దృష్టిలోకి కార్యకర్తలు తీసుకెళ్లాలి’ అని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
లక్ష ఎకరాలకు నీళ్లు
ఏ రాష్ట్రానికైనా అభివృద్ధిని చూసే కొలమానం తలసరి ఆదాయమేనని 2014లో దేశంలో 15వ స్థా నంలో ఉన్న తెలంగాణ ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రా గానే ధరణి తీసి వేసి బంగాళాఖాతంలో పడేస్తామని కాంగ్రెస్ నేతలలు చెబుతున్న మాయమాటలు నమ్మవద్దని తెలిపారు. రైతు బంధు, రైతు బీమాతో పాటు రెండుసార్లు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. మీ ఎంఎల్‌ఎ పట్టుదలతో మెడికల్ కాలేజీ కావాలని పట్టుబట్టడంతో పక్కనే కందుకూర్ మండలంలోని మీర్‌కాన్‌పేటలో మెడికల్ కాలేజీని మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ప్రజలకు రంగారెడ్డి,పాలమూరు ప్రాజెక్టు నీటితో 1లక్ష ఏకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు. దీంతో 100 చెరువులు నింపుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

మోడీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీలు, ఒక్క నవోదన పాఠశాలను తెలంగాణకు ఇవ్వలేదని తెలిపారు. ఇబ్రహీపట్నం ఎంఎల్‌ఎ రూ. 700 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాంచారని గ్రామాల్లోనూ డబుల్ రోడ్డు నిర్మాణం కోసం ప్రత్యేక నిథులు కోరుతున్నారని చెప్పారు. ఈ ప్రాంతం గుండా రీజినల్ రింగ్ రోడ్డు , కలెక్టర్ కార్యాలయం, పండ్ల మార్కెట్ , పాక్స్‌కాన్ ఇండస్ట్రీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని వెల్లడించారు. అంతే కాకుండా 600 ఎకరాలలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉందని అక్కడ కూడ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కెసిఆర్ కోరారు. ఈ సభలో బిఆర్‌ఎస్‌నేతలు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News