Monday, April 29, 2024

ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం : వికాస్‌రాజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రానున్న సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఓటు హక్కు వినియోగం మీద విస్తృత మైన ప్రచారం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ బంజారభవన్‌లో ఈఆర్‌ఓ, బూత్ స్థాయి పర్యవేక్షకులకు ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన సదస్సులో జాయింట్ సిఈఓ లోకేశ్ కుమార్, అదనపు సిఈఓ సర్ఫారాజ్, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ పాల్గొనగా.. ఆయన సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర ఎంతో కీలకమైనందున అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు.

త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నికల అధికారులకు ఆదేశించారు. 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. బూత్ స్థాయి సూపర్ వైజర్‌లు, నోడల్ అధికారులు రెసిడెన్షియల్ అసోసియేషన్ వెల్ఫేర్ వారితో సంప్రదించి అపార్ట్ మెంట్‌లో ఉండే వారిని ఓటు నమోదు, మార్పులు చేర్పులు చేసే విధంగా ఫామ్- 6,7,8 లను సేకరించాలని సూచించారు. ఎన్నికలలో వంద శాతం ఓటు వేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సందర్బంగా సదస్సు హాజరైన వారితో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ప్రతిజ్ఞ చేయించారు
ఈఆర్‌ఓ, డిఎల్ ఎంటిలకు శిక్షణ..
ఎన్నికలను పారదర్శకంగా.. పకడ్భందీగా నిర్వహించేందుకు వీలుగా అభ్యంతరాలు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ అన్నారు. మంగళవారం బిఆర్‌కెఆర్‌భవన్‌లోని ఎన్నికల రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 62 మంది ఈఆర్‌వోలు, 18 జిల్లాల డిఎల్‌ఎంటిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్, మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో నమోదులను చేర్చడం/ తొలగించడం/ సవరించడం కోసం దరఖాస్తులను పరిష్కరించేటప్పుడు, ఎన్నికల నిబంధనలు, విధానాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని ఈఆర్‌ఓలకు సూచించారు. సాధారణ, క్లిష్టమైన పరిస్థితులను చక్కదిద్దేందుకు నియమాలు, సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు. అంతకుముందు శిక్షణ కార్యక్రమాల్లో జాతీయ స్థాయి మాస్టర్ ట్రైనర్లు సెటియా, సయ్యద్ నాసిర్ జమీల్, శివ ప్రసాద్, సౌరభ్ రాయ్‌లు ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News