Monday, April 29, 2024

మహిళలు అనేక రంగాలలో పురోగమిస్తున్నారు: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Women are making progress in many fields

హైదరాబాద్: తెలంగాణలో మహిళలు అనేక రంగాలలో పురోగమిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా సింగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ, విద్యా, ఉపాధి రంగాలలో రాణిస్తున్నారని,  మహిళల శక్తిని ఎంత సద్వినియోగ పరుచుకుంటే సమాజం అంత పురోగమిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో సుపరిపాలనగా ఉందని, అన్ని వర్గాలకు సామాజిక, సాంఘీక, అర్థిక భద్రత కల్పిస్తున్నామని,  రక్షాబంధన్ అన్నాచెళ్లెల్ల అనుబంధం మాత్రమే కాదని,  సమాజంలో ఉన్న ప్రతి మహిళను, ప్రతి శిశువును గౌరవించడమే కాకుండా కొలవడం మన సంస్కృతి, సాంప్రదాయం అని అన్నారు. దానిని కొనసాగించడం అంటే మహిళలను సంతోషపెట్టడమేనని సింగిరెడ్డి చెప్పారు.

కుటుంబంలోనే కాకుండా సమాజంలో ఎలాంటి వివక్ష, దాడి, విద్వేషం, అమానుషాలు లేకుండా వారు ఆరోగ్యంగా , ఆనందంగా ఉండగలిగే సమాజమే నిజమైన సమాజమన్నారు.  ఆ దిశగా సమాజంలో మేల్కొలుపు రావాలని, ప్రత్యేకించి ప్రస్తుత తరం తమ కుటుంబంలో తమ చెల్లిని, తల్లిని గౌరవించినట్లే సమాజంలోని ఇతర మహిళలను గౌరవించే సంస్కారం అలవర్చుకోవాలని సూచించారు. ఈ మధ్య కాలంలో అది కొరవడింది .. దాని మూలంగా వస్తున్న దుష్పరిణామాలను మనం చూస్తున్నామని,  వ్యాపారాత్మకంగా వస్తున్న సినిమాలు, నవీన సాంప్రదాయం పేరుతో జరుగుతున్న ఆరాచక కార్యక్రమాల మూలంగా పెడధోరణులు కనబడుతున్నా సమాజం తనను తాను సంస్కరించుకునే శక్తి కలిగే ఉంటుందన్నారు. సమాజంలోని కొంతమంది ఆలోచనాపరులు మిగతా వారిని ప్రభావితం చేస్తున్నారని సింగిరెడ్డి ప్రశంసించారు.

రక్షాబంధన్ కార్యక్రమం నేపథ్యంలో వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీలు కట్టిన వారికి  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా జడ్పిటిసిలు, ఎంపిపిలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, ఎంపిటిసిలు, సర్పంచ్ తదితర ప్రజా ప్రతినిధులు, బ్రహ్మకుమారీలు తదితరులు  మంత్రికి రాఖీలు కట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News