Monday, May 6, 2024

సిఐసిగా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియామకం

- Advertisement -
- Advertisement -

సిఐసిగా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియామకం
ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి

Yashvardhan Kumar Sinha appointed as CIC

న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్(సిఐసి)గా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియమితులైనట్లు రాష్ట్రపతి భవన్ శనివారం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో సిఐసిగా సిన్హా చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆగస్టు 26న బిమల్ జుల్కా తన పదవీ కాలాన్ని పూరి చేసుకోవడంతో గత రెండు నెలలకు పైగా సిఐసి పదవికి ఖాళీ ఏర్పడింది. మాజీ దౌత్యాధికారి అయిన సిన్హా 2019 జనవరి 1న సమాచార కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన బ్రిటన్, శ్రీలంక దేశాలకు భారత హైకమిషనర్‌గా పనిచేశారు. 62 సంవత్సరాల సిన్హా సిఐసిగా మూడేళ్లు కొనసాగుతారు. సిఐసి, సమాచార కమిషనర్ల పదవీకాలం ఐదేళ్లు లేదా 65 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది. ప్రాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ సిన్హాను ఈ పదవికి ఎంపికచేసింది.

ఈ కమిటీలో లోక్‌సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, హోం మంత్రి అమిత్ షా ఇతర సభ్యులు. సిన్హాతో పాటు సమాచార కమిషనర్లుగా జర్నలిస్టు ఉదయ్ మహుర్కర్, మాజీ కార్మిక శాఖ కార్యదర్శి హీరాలాల్ సమరియా, మాజీ డిప్యుటీ కంప్ట్రోలర్ అండ్ జనరల్ సరోజ్ పున్హానిలను ఎంపిక చేశారు. వీరి నియామకంతో కేంద్ర సమాచార కమిషన్ సభ్యుల సంఖ్య ఏడుకు పెరిగింది. ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషనర్లుగా వనజ ఎన్ సామా, నీరజ్ కుమార్ గుప్తా, సురేష్ చంద్ర, అమితా పండోవే ఉన్నారు. మొత్తం 10 మంది సభ్యులను సమాచార కమిషన్‌లో నియమించే అవకాశం ఉంటుంది.

Yashvardhan Kumar Sinha appointed as CIC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News