Saturday, April 27, 2024

సిరియా ఆస్పత్రిపై రాకెట్‌ దాడులు.. 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

డమస్కస్: సిరియాలోని ఆఫ్రిన్ నగరంలో ఆల్ షిఫా ఆస్పత్రిపై రెండు రాకెట్లతో దాడి చేయడంతో 13 మంది మరణించారు. ఈ దాడిలో మరో 27 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులలో ఇద్దరు మెడికల్ స్టాఫ్ ఉన్నట్టు సమాచారం. ఈ దాడులతో సర్జరీ, ప్రసూతి విభాగాలు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆస్పత్రిని మూసివేశారు. ఆఫ్రిన్ నగరంలో మెజార్టీ ప్రజలుగా కుర్దులు ఉన్నారు. 2018లో టర్కీ-సిరియా బలగాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో కుర్దులు మైనార్జీలుగా మారారు. దీంతో ప్రభుత్వానికి కుర్దుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. కుర్దులు ఆధ్వర్యంలో ఈ ఘటన జరిగిందని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ లీడర్ మజ్లోమ్ అబాది ఆరోపణలు చేస్తున్నాడు. ఈ దాడి తాము చేయలేదని కుర్దుల వర్గం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News