Monday, April 29, 2024

కేసులు తగ్గుతున్నాయి

- Advertisement -
- Advertisement -

 Corona positive cases

ప్లాస్మాథెరఫీకి అనుమతి వచ్చింది
కొత్తగా 13 కేసులు, 29 మంది డిశ్చార్జ్
983కు చేరుకున్న కొవిడ్ బాధితుల సంఖ్య
కొన్ని కుటుంబాలతోనే అత్యధిక కేసులు
మీడియా సమావేశంలో మంత్రి ఈటల

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్లాస్లాథెరఫీకి అనుమతి వ చ్చిందని, క్రిటికల్ కండిషన్‌లో ఉన్న కరోనా బాధితులకు ఈ చికిత్సను అందిస్తామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇతర దేశాల్లోని ప్రా ంతాల్లోని ప్లాస్మాథెరపీ రిజల్ట్ రేటును బట్టి, నిపుణుల సలహాలతో రోగులకు ఈ చికిత్సను అందిస్తామని ఆయన తెలిపారు. కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ“రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జోగులాంబ 9, జిహెచ్‌ఎంసి పరిధిలో 2, రంగారెడ్డిలో 1, నిర్మల్‌లో మరోక కేసు చొప్పున నమోదుకాగా, 29 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 983కి చేరింది. ఇప్పటి వరకు వేర్వేరు ఆసుపత్రుల్లో 663 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మిగతా వారందరి ఆరోగ్యం మెరుగ్గా ఉంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు. కోవిడ్-19 కారణంగా ఇప్పటివరకు 25 మంది మృతిచెందారు. రాష్ట్రంలో అమలవుతున్న కరోనా కట్టడి చర్యలపై కేంద్ర మంత్రి తెలంగాణని అభినందించారు. వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు ఎన్ 95 మాస్కులన్ని సరిపడా ఉన్నాయి. అవసరమైన అదనపు కిట్లకు కూడా ఆర్డర్ ఇచ్చామని’ మంత్రి ఈటల వ్యాఖ్యానించారు.

ఆ నాలుగు ప్రాంతాల్లోనే అధికంగా కేసులు నమోదు..
రాష్ట్రంలో జిహెచ్‌ఎంసి పరిధి, సూర్యాపేట్, వికారాబాద్, గద్వాల జిల్లాల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. వికారాబాద్‌లో 14 కుటుంబాల నుంచి 38 మందికి, గద్వాలలో 30 కుటుంబాలలో 45 మందికి, సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి, జీహెచ్‌ఎంసీ పరిధిలో 44 కుటుంబాల నుంచి 265 మందికి కరోనా సోకింది. దీంతో ఆయా కుంటుంబాలను కంటైన్‌మెంట్ చేశాం. ప్రతి రోజూ జిహెచ్‌ఎంసి, హెల్త్, రెవెన్యూ శాఖల అధికారులంతా పూర్తిస్థాయి సమన్వయంతో పాజిటివ్ ఎక్కువగా నమోదవుతున్న ఏరియాల్లో నిఘా పెట్టాం. అనుమానిత లక్షణాల వారిని గుర్తించి, వెంటనే పరీక్ష లు నిర్వహిస్తున్నాం. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. కరీంనగర్‌లో పాటించిన నిబంధనలు ఈ ప్రాంతాల్లో అమలు చేస్తున్నాం. త్వరలోనే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అనుమతులు వచ్చిన 9 ల్యాబ్‌లలో ప్రతి రోజూ సుమారు 1600 మందికి టెస్టులు చేసే అవకాశం వచ్చిందని’ తెలిపారు.

డిశ్చార్జ్‌ల సంఖ్య పెరుగుతోంది..
‘రాష్ట్రంలో డిశ్చార్జ్‌ల సంఖ్య పెరుగుతోంది. మరో నాలుగైదు రోజుల్లో సుమారు 40 నుంచి 50 మంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొందరిలో వైరస్ గమ్మత్తుగా వ్యవహరిస్తుంది. ఇటీవల కరీంనగర్‌లో 14 రోజుల క్వారంటైన్ పూర్తయిన తర్వాత వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతోనే క్వారంటైన్ పీరియడ్‌ను పెంచాం. ఇతర రాష్ట్రాలూ దీన్ని పాటిస్తున్నాయి. ముఖ్యమంత్రి నిరంతర మానిటరింగ్‌తో కరోనా కంట్రోల్ చేసేందుకు అధికారులంతా కృషి చేస్తున్నారు. ప్రజలు కూడా ఇదే సహకారం, ఒరవడితో కొన్ని రోజులు పాటించాలని ’మంత్రి ఈటల అన్నారు.

వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ప్రచారం చేయొద్దు..
‘రాష్ట్రంలో వైద్యులు ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా అసత్యప్రచారాలు చేయొద్దు. కొందరు గాంధీ ఆస్పత్రిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. ఊరంత ఒక దారి అయితే ఊసరవేళ్లిది మరోకదారి అన్నట్లు కొందరు సైకోలు, శాడిస్టులు పాత ఫోటోలతో దుష్ప్రాచారం చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిని సంపూర్ణ కొవిడ్ ఆస్పత్రిగా మారింది. మరమ్మతులు చేసి కొవిడ్ ఆస్పత్రికి ఉండే సౌకర్యాలు కల్పించాం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు. కరోనా బాధితులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నాం.గాంధీ ఆస్పత్రిలో ఏ ఒక్క పేషెంట్ కూడా సదుపాయాలు సరిగా లేవని చెప్పలేదు. వైద్యులను వేధించినా, దాడులకు పాల్పడ్డా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని’ మంత్రి హెచ్చరించారు.

 

14 Corona positive cases in state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News