Monday, April 29, 2024

రాష్ట్రంలో కొత్తగా 1,436 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1436 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 1436 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 14 మంది కరోనాతో మరణించారు. అదే సమయంలో మరో 3,614 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,016 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 94.85శాతానికి చేరింది. జిహెచ్ఎంసి పరిధిలో 184, నల్లొండ 118, ఖమ్మం 148 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 97,751 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

1436 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News