Monday, April 29, 2024

జమ్మూ, హిమాచల్‌లో వరద బీభత్సం.. 16మంది మృతి

- Advertisement -
- Advertisement -

జమ్మూ , హిమాచల్‌లో వాన వరద బీభత్సం
16 మంది దుర్మరణం…జాడతెలియకుండా ఏడుగురు
కార్గిల్ ప్రాంతంలో దెబ్బతిన్న విద్యుత్ కేంద్రం
మరో రెండు మూడు రోజులు వర్షాలు?

ఉత్తరంలో విపరీతం
ఉత్తరభారతం ఉన్నట్లుండి అసాధారణ వర్షాలతో అస్థవ్యస్థం అయింది. జులై నెలలో ఎప్పుడూ లేనంత స్థాయిలో కొన్ని ప్రాంతాలనే కేంద్రీకృతం చేసుకుని మబ్బులు పగిలినట్లుగా కుండపోత వానలు పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో జులై వాతావరణానికి భిన్నంగా వానలు పడి వీధులు వరదలయ్యాయి. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లద్ధాఖ్‌లో వర్షాలధాటికి ఇళ్లు కూలడం, మనుష్యులు కొట్టుకపోవడం వంటి ఘటనలతో 16 మంది మృతి చెందారు. ఆకస్మిక వరదలతో జనం నానాకష్టాలు పడ్డారు. మంగళవారం అర్థరాత్రి తరువాత విపరీత వర్షాలు హిమాలయ శ్రేణువులలోని పర్యావరణానికి విఘాతంతో తలెత్తిన పరిణామాలని నిపుణులు హెచ్చరించారు. ఇటువంటి పరిణామాలు పర్వత శ్రేణువులలో ప్రకంపనలకు దారితీస్తాయని తెలిపారు.

సిమ్లా /జమ్మూ: భారీ వర్షాలతో తలెత్తిన వరుస ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. హిమాచల్ ప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్‌ల్లో కనీసం 16మంది ప్రాణాలు కోల్పోయారు. జనం నిద్రలో ఉండగానే వచ్చిపడ్డ వరదలతో పలు ఫక్కా ఇళ్లు దెబ్బతిన్నాయి. కూలాయి. పంటపొలాలు, ఓ చిన్న విద్యుత్ కేంద్రం ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామం కిశ్తార్ జిల్లాలో తెల్లవారుజామున కుండపోత వాన పడింది. ఆకస్మిక వరదలతో హోంజార్ గ్రామంలో దాదాపు ఏడుగురు మృతి చెందారు. 17 మంది గాయపడ్డారు. జమ్మూ కశ్మీర్‌లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఈ పరిణామంతో అప్రమత్తం చేశారు. ఇక మంచుకొండల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లలో కనీసం తొమ్మండుగురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఏడుగురి జాడ తెలియడం లేదు. లద్థాఖ్ ప్రాంతాన్ని కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. కార్గిల్‌లోని వివిధ చోట్ల భారీ వర్షాలు, వరదలతో ఇక్కడి ఓ మినీ జల విద్యుత్ కేంద్రం దెబ్బతింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక్కడ ప్రాణనష్టం జరగలేదు. హిమాచల్‌లో లాహౌల్ స్పితిలో తలెత్తిన ఆకస్మిక వరదలు ప్రాణ నష్టానిక దారితీశాయి. ఇక్కడనే ఏడుగురు బలి అయ్యారని అధికారులు ధృవీకరించారు. పర్యాటక ప్రాంతం అయిన కులూ జిల్లాలో ఆకస్మిక వరదల ధాటికి ఓ ఢిల్లీ పర్యాటకుడు, తల్లీ కొడుకు, ఓ జల విద్యుత్ ప్రాజెక్టు అధికారి కొట్టుకుపోయారు.

16 died due heavy floods in Jammu and Ladakh
గల్లంతైన వారికోసం గాలింపు
కిశ్తార్ జిల్లాలో వరదల తరువాత కన్పించకుండా పోయిన వారిని కనుగొనేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసులు గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు. ఇక్కడ 14 మంది జాడ తెలియకుండా ఉంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగం ఈ ప్రాంతంలో అన్వేషణ జరుపుతోంది. హోంజర్ గ్రామంలో కుండపోత తరువాత కూలిన ఇళ్లు, కన్పించకుండా పోయిన కొందరితో విషాద భయానక ఛాయలు నెలకొన్నాయి.
పరిస్థితిని పర్యవేక్షిస్తోన్న కేంద్రం
జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో వర్షబీభత్సంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పరిస్థితిని పూర్తి స్థాయిలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఉన్నతాధికారుల ద్వారా సమీక్షిస్తున్నారు. దెబ్బతిన్న మారుమూల ప్రాంతాలలో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ ఆదేశించారు. జరిగిన నష్టంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డిజిపి దిల్బాగ్ సింగ్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని ఆరాతీశారు. సహాయక చర్యలలో తోడ్పాటు అందించేందుకు రెండు కాలమ్స్ ఆర్మీని రంగంలోకి దింపినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల చివరి వరకూ జమ్మూ కశ్మీర్ లోతట్టు ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు వెలువరించింది.

16 died due to heavy floods in Jammu and Ladakh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News