Monday, April 29, 2024

2100 మంది మయన్మార్ రాజకీయ ఖైదీలు క్షమాభిక్షపై విడుదల

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్ : మయన్మార్‌లో 2100 మందికి పైగా రాజకీయ ఖైదీలను మానవీయ కోణంలో క్షమాభిక్షతో విడుదల చేస్తున్నామని మయన్మార్ పాలక మిలిటరీ కౌన్సిల్ బుధవారం వెల్లడించింది. 2021 ఫిబ్రవరిలో మిలిటరీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు మిలిటరీ పాలనను విమర్శించడం, లేదా నిరసన తెల్పడం, తదితర అహింసాత్మక ఆందోళనలతో అరెస్టయిన వేలాది మంది రాజకీయ ఖైదీలకే ఇప్పుడు విడుదలయ్యే అవకాశం కల్పించారు. ఈ సంవత్సరం అతి ముఖ్యమైన బుద్ధుని జననం, జ్ఞానోదయం, నిర్యాణం తదితర ఘట్టాలకు సంబంధించిన పవిత్రదినం సందర్భంగా మయన్మార్ మిలిటరీ కౌన్సిల్ అధినేత సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హ్లాయింగ్ 2153 మంది రాజకీయ ఖైదీలకు క్షమాభిక్ష కల్పించారని అధికార ఎంఆర్‌టివి టెలివిజన్ వెల్లడించింది.

ఖైదీల విడుదల బుధవారం ప్రారంభమైంది. కానీ పూర్తి కాడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. విడుదలైన వారి వివరాలు ఇప్పటికి లభ్యం కాలేదు. అయితే విడుదలైన వారిలో అంగ్‌సాన్ సూకీ మాత్రం లేరు. ఆమె ప్రస్తుతం అనేక నేరాభియోగాలపై 33 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నారని మిలిటరీ ప్రచారం చేస్తోందని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. మయన్మార్‌లో ముఖ్యమైన ప్రధాన శెలవు దినాల్లో సామూహికంగా ఖైదీలను విడుదల చేయడం సాధారణమే. అయితే ఒకేసారి భారీ సంఖ్యలో ఖైదీలను 2021 జులైలో జరిగింది. ఆనాడు 2296 మందిని విడిచిపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News