న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో అత్యధికంగా 32,695 కొత్త కోవిడ్-19 కేసులు, 606 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసులు 9,68,876కి చేరింది. వీటిలో 3,31,146 యాక్టివ్ కేసులుండగా… 6,12,815 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 24,915 మంది కరోనాతో ప్రాణాలు విడిచారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఎపిలో 33,019 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 408 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో 375మందిని కోవిడ్ కబలించగా.. కరోనా కేసుల సంఖ్య 39,342కి చేరింది. అటు మహారాష్ట్రలో కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు 2,75,640 మందికి కరోనా వైరస్ సోకగా… 10,928 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,12,099 యాక్టివ్ కేసులుండగా… 1,52,613మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, కర్నాటకలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి.
32695 COVID 19 cases and 606 deaths in India