Thursday, May 9, 2024

కరోనాను జయించిన 33 రోజుల పసికందు…

- Advertisement -
- Advertisement -

33 Days baby recovered from Corona virus

 

కోల్ కతా: 33 రోజుల పసికందు కరోనా వైరస్ నుంచి కోలుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. 30 రోజులు ఆస్పత్రి ఉంటే 23 రోజులు ఆ పసికందుకు కృత్తిమ శ్వాస అందించి బతికించారు వైద్యులు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం… గర్భవతికి పురటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. సుఖ కాన్పులో ఇద్దరు పిల్లలకు ఆమె జన్మినిచ్చింది. పుట్టగానే పాప చనిపోవడంతో సదరు బాలింతకు కరోనా టెస్టు చేయగా పాజిటివ్ వచ్చిందని వెంటనే కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. 1.4 కేజీలతో పుట్టిన బాబు కూడా శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతుంటే వెంటనే కరోనా టెస్టు చేయగా పాజిటివ్ రావడంతో ఆనంద్ పూర్ లో ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఎన్ఐసియులో బాబును ఉంచి ఆక్సిజన్ అందించారు. పాజిటివ్ వచ్చిన రోజు నుంచి 9, 16వ రోజు టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. 21వ రోజుల తరువాత ఆ బాబుకు నెగటివ్ రావడంతో కోవిడ్ బ్లాక్ నుంచి బాబును జనరల్ వార్డుకు తరలించారు. సాల్ట్ లేక్ ఆస్పత్రిలో తల్లికి కరోనా చికిత్స చేసిన అనంతరం నెగటివ్ వచ్చిన బాబుకు తల్లి పాలు ఇప్పించారు. ప్రస్తుతం బాబు బరువు 2 కిలోలు ఉన్నాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News