Saturday, April 27, 2024

54 జిల్లాల్లో 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు

- Advertisement -
- Advertisement -

గత కొన్ని వారాలుగా రోజువారీ కొవిడ్ కేసుల తగ్గుదల రేటులో వేగం తగ్గిందని, ఇది ఆందోళన కలిగించే అంశమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం పేర్కొంది.

54 జిల్లాల్లో 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు
గత కొద్ది వారాలుగా కేసుల తగ్గుదల రేటు వేగం తగ్గింది
ఇది ఆందోళన కలిగించే విషయం: కేంద్రం

న్యూఢిల్లీ: గత కొన్ని వారాలుగా రోజువారీ కొవిడ్ కేసుల తగ్గుదల రేటులో వేగం తగ్గిందని, ఇది ఆందోళన కలిగించే అంశమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం పేర్కొంది. కాగా జూలై 26తో ముగిసిన వారంలలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 54 జిల్లాల్లో పాజిటివిటీ రేటు పది శాతం, అంతకంటే ఎక్కువగా ఉందని కూడా తెలిపింది ‘ మే 5-11 మధ్యకాలంలో 3,87,029 కేసులనుంచి జులై 21-27నాటికి 38,090 కేసులకు తగ్గాయి. అయితే గత కొన్ని వారాలుగా తగ్గుదల రేటు మందగించింది. ఇది ఆందోళన కలిగించే అంశంగా ఉంది’ అని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ విలేఖరుల సమావేశంలో చెప్పారు. గత నాలుగు వారాలుగా ఏడు రాష్ట్రాల్లోని 22 జిల్లాల్లో రోజువారీ కేసుల పెరుగుదల కనిపిస్తోందని, ఇది కూడా ఆందోళన కలిగించే అంశమేనని తెలిపారు. కాగా ఎనిమిది జిల్లో పాజిటివిటీ రేటు తగ్గుముఖం పటినప్పటికీ రోజువారీ కేసులు పెరుగుతున్నాయని, అందువల్ల మనం పరిస్థితిని తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదని కూడా అగర్వాల్ తెలిపారు. కొవిషీల్డ్ 93 శాతం రక్షణ ఇస్తోందని,, అంతేకాక మరణాల రేటులో 98 శాతం తగ్గుదల ఉన్నట్లు దాదాపు 15 లక్షల మంది డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై సాయుధ దళాల మెడికల్ కాలేజి నిర్వహించిన ఓ అధ్యయనం కనుగొన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
30 వేల దిగువకు రోజువారీ కేసులు
ఇదిలా ఉండగా 132 రోజుల తర్వాత దేశంలో తొలిసారిగా 30 వేలకన్నా తక్కువ నమోదయ్యాయి. అలాగే 124 రోజుల తర్వాత తొలి సారిగా యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షలకన్నా తక్కువ నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 29,689 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,14,40,951కి చేర్కుంది. కాగా తాజాగా మరో 415 మంది వైరస్‌తో పోరాడుతూ మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,21,382కు చేరింది. కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,98,100కు పడిపోయింది. రికవరీ రేటు 97.39 శాతానికి చేరుకోగా రోజువారీ పాజిటివిటీ రేటు 1.73 శాతానికి తగ్గినట్లు మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం 8 గంటలకు విడుదల చేసిన డేటా పేర్కొంది.

50 కోట్ల డోసులు ఇచ్చి తీరుతాం
ఇదిలా ఉండగా దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మందకొడిగా సాగుతోందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రప్రభుత్వం ఖండించింది. ముందస్తుగా నిర్దేశించుకున్న లక్షాల ప్రకారం వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని స్పష్టం చేసింది. ముఖ్యంగా జులై నాటికి నిర్దేశించుకున్న లక్షాలను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ వస్తున్నవి తప్పుడు కథనాలని స్పష్టం చేసింది. జులై 31 నాటికి 51 కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసి తీరుతామని స్పష్టం చేసింది. జనవరినుంచి జులై చివరి నాటికి మొత్తం 51.60 కోట్ల డోసులను రాష్ట్రాలకు సరఫరా చేస్తామని గతంలోనే అన్ని రాష్ట్రాలకు తెలియజేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇప్పటికే 45.7 కోట్ల డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేయడం జరిగిందని, మిగతా 6.03 కోట్ల డోసులు జులై 31 నాటికి చేరుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

50 Cr Covid Vaccine doses to be available by July 31: Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News