Monday, April 29, 2024

పాక్‌లో 50మంది పైలట్ల లైసెన్సులు రద్దు

- Advertisement -
- Advertisement -

50 pilots licenses revoked in Pakistan

 

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రభుత్వం ఆ దేశానికి చెందిన 50మంది పైలట్ల లైసెన్సులను రద్దు చేసింది. బోగస్ సర్టిఫికెట్లతో వారు పైలట్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని ఆ దేశ పౌర విమానయాన సంస్థ(సిఎఎ) ఇస్లామాబాద్ హైకోర్టుకు తెలిపింది. నకిలీ సర్టిఫికెట్లను వారికి ఎవరిచ్చారన్నదానిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్టు సిఎఎ తెలిపింది. ఈ ఏడాది మే 22న కరాచీలో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిన ఘటనతో నకిలీ పైలట్ల వ్యవహారం వెలుగు చూసింది. ఆ దుర్ఘటనలో 97మంది మృతి చెందారు. ఆ సందర్భంగా ఆ దేశ విమానయానశాఖమంత్రి గులామ్ సర్వర్‌ఖాన్ మాట్లాడుతూ తమ దేశంలోని 860మంది పైలట్లలో 260 మంది నకిలీ సర్టిఫికెట్లు కలిగినవారేనని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News