Monday, April 29, 2024

బ్రిటన్‌లో అదుపు తప్పిన కరోనా.. క్రిస్మస్ వేడుకలు రద్దు

- Advertisement -
- Advertisement -

బ్రిటన్‌లో అదుపు తప్పిన కరోనా
క్రిస్మస్ వేడుకలను రద్దు చేసిన ప్రధాని జాన్సన్

లండన్: బ్రిటన్‌లో కరోనా వైరస్ అదుపు తప్పిందని బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్‌కాక్ ఆదివారం అంగీకరించారు. ప్రధాని బోరిస్ జాన్సన్ లండన్, ఆగ్నేయ ఇంగ్లాండ్‌ల్లో లాక్‌డౌన్ విధించడమేకాక, కొన్ని వేల మంది ప్రజల క్రిస్మస్ వేడుకల సన్నాహాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని తర్వాత ఆరోగ్య కార్యదర్శి కరోనా తీవ్రత గురించి వెల్లడించారు. ఇంగ్లాండ్ నుంచి పర్యాటకులను స్కాట్లాండ్ నిషేధించింది. కరోనా వ్యాప్తి 70శాతం వరకు తీవ్రంగా ఉండడంతో వేల్స్‌లో లాక్‌డౌన్ మళ్లీ విధించారు. కెంట్‌లోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో బిబిసి ప్రతినిధి ఆండ్రూ మార్‌షో కరోనా అదుపులో ఉందా? అన్న ప్రశ్నకు ఆరోగ్యకార్యదర్శి హాన్‌కాక్ లేదు అని విచారం వెలిబుచ్చారు. క్రిస్మస్‌కు ప్రజలు ఇంటివద్దనే ఉండడమే ఉత్తమ కానుకగా ఆయన వ్యాఖ్యానించారు.

లండన్, ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో నాలుగో స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. క్లబ్బులను మూసి వేయించారు. నాలుగో జోన్ నుంచి ప్రజలు ఎక్కడకూ బయటకు వెళ్లరాదని ఆంక్షలు విధించారు. ఇంతవరకు 3,50,000 మందికి ఫైజర్ వ్యాక్సిన్ మొదటి మోతాదు ఇచ్చారు. ఆదివారం ఉదయం నుంచి ఆంక్షలు కఠినంగా అమలు లోకి రానున్నందున లండన్ లోని విమానాశ్రయాలు, రైలుస్టేషన్లు, రోడ్లు శనివారం రాత్రి వేలాది మంది జనం రద్దీతో కిక్కిరిసి పోయాయి.

Christmas Celebrations Cancelled in Britain due to Covid

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News