Saturday, May 4, 2024

7 రాష్ట్రాల నుంచి 63 శ్రామిక్ స్పెషల్ రైళ్లు

- Advertisement -
- Advertisement -

63 Shramik special trains from 7 states

 

న్యూఢిల్లీ: వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఎన్ని శ్రామిక్ స్పెషల్ రైళ్లు కావాలో తెలియచేయాలంటూ రైల్వే బోర్డు చైర్మన్ వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసిన దరిమిలా మొత్తం 63 శ్రామిక్ స్పెషల్ రైళ్లు కోరుతూ ఏడు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైల్వే శాఖకు విజ్ఞప్తులు అందాయి. కేరళ నుంచే 32 రైళ్లు బయల్దేరతాయని, వీటిలో అత్యధికం(23) పశ్చిమ బెంగాల్‌కు వెళతాయని రైల్వే శాఖ తెలిపింది. కేరళతో పాటు తమిళనాడు 10 శ్రామిక్ స్పెషల్ రైళ్లను కోరింది. జమ్మూ కశ్మీరు 9, కర్నాటక 6, ఆంధ్రప్రదేశ్ 3, పశ్చిమ బెంగాల్ 2, గుజరాత్ 1 రైలును కోరినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తనకు ఎన్ని రైళ్లు కావాలో ఇంకా తెలియచేయవలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News