Monday, April 29, 2024

ఫాస్టర్ టచ్ చేస్తే తల్లి బ్రతుకుందటా…?

- Advertisement -
- Advertisement -

కాసిపేటః సైన్స్ ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఇంకా మూఢ నమ్మాకాల విశ్వాసాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. విద్యావంతులు అయిన వారే మూడ నమ్మాకాలను ఆచరణలో పెడుతుండడం సైన్స్ రంగం ఎటు పోందుందనే సందేహాలు వ్యక్తం అవుచున్నాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నిడదవోలుకు చెందిన 85 సంవత్సరాల వృద్దురాలు గురువారం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలి కూమారుడు, కూతుర్లు వృద్దురాలి మృతదేహాంను అంబులెన్స్ లో శుక్రవారం ఉదయం సోమగూడెంలోని కల్వరీ చర్చికి తీసుకొని వెళ్లారు. చర్చి ఫాదర్ టచ్ చేస్తే తమ తల్లి బ్రతుకుతుందని పాస్టర్‌తో ప్రార్థన చేయించాలని పట్టు పట్టారు. దీంతో నిర్వహాకులు సాయంత్రం 6 గంటల వరకు ఫాదర్ రాడని తేల్చి చెప్పారు. దీంతో మృతురాలి కుమారుడు సాయంత్రం 6 గంటల వరకు వేచి ఉండే ధోరణిలో ఉండగా అంబులెన్స్ డ్రైవర్, బందువులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మృతురాలి కూమారుడు, కూతుర్లు కూడా ఉన్నత విద్యను అభ్యసించినట్లు వారు తెలిపారు. కల్వరీ చర్చి ఫాదర్ తమ తల్లి మృత దేహాన్ని టచ్ చేసి ప్రార్థన చేసినట్లయితే తమ తల్లి బ్రతుకుతుందని, ఇలాంటి సంఘటనలు తాను పలు ప్రోగ్రాంలో చూడడం జరిగిందని మృతుడి కుమారుడు తెలుపడంతో అక్కడ అందరు అవాక్కయ్యారు. మృతి చెందిన వారు ఎలా బ్రతుకుతారని, స్థానికులు ప్రశ్నించినప్పటికి ఆమె కూమారుడు వినక పోవడంతో స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేసారు. సూమరు 6 గంటల పాటు చర్చి సమీపంలోనే మృతదేహాంతో ఉండడంతో స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని మృతిరాలి కూమారుడు వింత ధోరణిని ఎండగట్టడంతో బందువులు బలవంతంగా అంబులెన్స్‌లో మృతదేహాన్ని నిడదవోలు గ్రామానికి తీసుకొని వెళ్లడం గమనార్హం. సైన్స్ రంగం ఇంత వేగవంతం ఐనప్పటికి ఇంకా మూఢ నమ్మాకాలను విస్మసిస్తుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News