Saturday, May 11, 2024

భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్ లో 348 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

 

వెల్లింగ్‌టన్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 348 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో కివీస్ 183 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు 216/5తో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ కు బుమ్రా షాకిచ్చాడు. తొలి బంతికే వాట్లింగ్(14) కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి వికెట్ చేజార్చుకున్నాడు. కొద్దిసేపటికే మరో వికెట్ కోల్పియిన కివీస్ కు కొలిన్ గ్రాండ్ హోమ్(43), జేమిసన్(44)లు ధాటిగా ఆడి ఎనిమిదో వికెట్ కు 71 పరుగుల జోడించారు. దీంతో కివీస్ స్కోరు 300 పరుగుల దాటింది. వీరిద్దరూ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్(38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.దీంతో కివీస్ కు భారీ ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 5 వికెట్లతో రాణించగా.. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, మహ్మద్ షమి, బుమ్రా తలో వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఎదరుదెబ్బ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా(14) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపర్చాడు.  క్రీజులో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(33), చటేశ్వర పుజారా(6)లు ఉన్నారు. ప్రస్తుతం భారత్ 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.

 IND Trail by 129 runs against NZ in 1st Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News