Thursday, May 9, 2024

ఉక్కపోతగా ఉందని విమాన రెక్కపై వాకింగ్

- Advertisement -
- Advertisement -

టర్కీ: విమానంలో ప్రయాణించలంటే కొందరు భయపడుతారు. సవాలక్ష రూల్స్ ఉంటాయి. రూల్స్ అతిక్రమించి జైలు శిక్ష అనుభవించిన వారు కూడా ఉన్నారు. ఎక్కడ ఏ పొరపాటు చేసిన శిక్షలు పడిన రోజులు ఉన్నాయి. తాజాగా ఏంటంటే ఓ మహిళ విమానంలో ఉక్కపోతగా ఉందని ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు వచ్చి విమానం రెక్కపై సేద తీరింది. విమానం రెక్కపై వాకింగ్ చేయడంతో ఆమెను సిబ్బంది వద్దని హెచ్చరించారు. బోయింగ్ 737 విమానం టర్కీ నుంచి కీవ్ లోని బోరిస్పిల్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవగానే సదరు మహిళ ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు వచ్చి వాకింగ్ చేసింది. రూల్స్ అతిక్రమించినందుకు ఆమె పేరును బ్లాక్ లిస్ట్ లో చేర్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News