Friday, May 17, 2024

‘ప్రపంచం ముంగిట భారత మీడియా’..

- Advertisement -
- Advertisement -

‘ప్రపంచం ముంగిట భారత మీడియా’.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత ఉత్పత్తులనే కాకుండా మన గళాన్ని కూడా ప్రపంచం ఆదరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం జైపూర్‌లో పత్రికా గేట్‌ను, పత్రికా గ్రూప్ చీఫ్ గులాబ్ కొఠారీ రాసిన రెండు పుస్తకాలను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు అంతర్జాతీయ వేదికలపై భారత ప్రాతినిథ్యం పెరిగిన క్రమంలో భారత మీడియా కూడా అంతర్జాతీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. మన వార్తాపత్రికలు, మేగజీన్లకు అంతర్జాతీయంగా ఆదరణ ఉందని, డిజిటల్ శకంలో మనం డిజిటల్ వేదికగా ప్రపంచానికి చేరువ కావాలని అన్నారు. కోవిడ్-19పై భారత మీడియా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించిందని ప్రశంసించారు. సోషల్ మీడియా మాదిరిగా మీడియా సైతం కొన్ని సందర్భాల్లో విమర్శలు గుప్పించినా విమర్శల నుంచి ప్రతిఒక్కరూ నేర్చుకోవాలని, ఇదే దేశ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని అన్నారు. ప్రజలు పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు. వేదాలు, ఉపనిషత్తులు ఆథ్యాత్మిక, వేదాంత విజ్ఞానానికే పరిమితం కాదని, విశ్వం, శాస్త్రాల లోతులనూ అందిపుచ్చుకునే సామర్థ్యం కలిగినవని చెప్పుకొచ్చారు.

PM Modi launches Patrika Gate by video conference

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News