Saturday, April 27, 2024

తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగనున్న ఆమ్ ఆద్మీ పార్టీ

- Advertisement -
- Advertisement -

కొత్త ఇంఛార్జీ, ఎంఎల్‌ఎ దిలీప్ పాండే

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశమంతటా వేగంగా విస్తరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.  అంతే వేగంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, విస్తరణ కోసం ఆప్ నేతలు తమ దృష్టిని కేంద్రీకరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నూతన తెలంగాణ ఇంఛార్జ్, ఎంఎల్‌ఎ దిలీప్ పాండే పార్టీ రాష్ట్ర నేతలను కోరారు. తెలంగాణాలో ఆప్ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఆప్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆప్ నూతన తెలంగాణ ఇంచార్జ్, ఎమ్యెల్యే దిలీప్ పాండే ను ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్ లు కలసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్బంగా తెలంగాణ లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు కార్యక్రమాలపై చేర్చించారు. ఆప్ తెలంగాణ కమిటీ సంస్థాగత కార్యకలాపాలు, ఆందోళన కార్యక్రమాల గురించి అతనికి డాక్టర్ దిడ్డి సుధాకర్, బుర్ర రాము గౌడ్ లు వివరించారు. దిలీప్ పాండే మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ‘ప్రజల ఆధారిత’ ఆందోళన కార్యక్రమాలను ప్రశంసించారు. తెలంగాణాలో ఆప్ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలకు పోటీ చేయడానికి ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ఉండాలని, వార్డులు, సర్పంచులు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, కార్పొరేషన్లు ఇటువంటి వాటిని గెలిస్తేనే అరవింద్ కేజ్రీవాల్ కు, కేంద్ర నాయకత్వానికి ‘తెలంగాణ ఆప్’ మీద నమ్మకం కుదురుతుందని అన్నారు. అందువల్ల వాటి మీద దృష్టి పెట్టాలని కోరారు. తెలంగాణాలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, రైతు రుణాలపై ప్రజలకు చేసిన వాగ్దానాలపై మన గళం వినిపించాలని, అమలుకాని హామీలపై ఉద్యమించాలని, తాను త్వరలో తెలంగాణ రాష్ట్రానికి వస్తానని అంతకుముందు ‘జూమ్’ ద్వారా అందరితో మాట్లాడతానని దిలీప్ పాండే అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News