Sunday, April 28, 2024

మనోహరబాద్ ఎంపిడివొ ఇంట్లో,కారాలయంలో ఎసిబి సోదాలు

- Advertisement -
- Advertisement -

మనోహరబాద్ ఎంపిడివొ ఇంట్లో,కారాలయంలో ఎసిబి సోదాలు
రూ.3.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు

ACB searches at Manoharabad MPDVO home

మనతెలంగాణ/హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మెదక్ జిల్లా మనోహరబాద్ ఎంపిడివొ జైపాల్‌రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఎసిబి అధికారులు రూ. 3.40 కోట్ల అక్రమాస్తులను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం మనోహరబాద్ ఎంపిడివొ జైపాల్‌రెడ్డిని ఎసిబి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చడంతో అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం నాడు జైపాల్‌రెడ్డి ఇంటితో పాటు మనోహరాబాద్ ఎంపిడివొ కార్యాలయంలో

నిజామాబాద్ రేంజ్ ఎసిబి డిఎస్‌పి ఆనంద్‌కుమార్ నేతృత్వంలో అధికారులు సోదాలు చేపట్టారు. ఈక్రమంలో మనోహరాబాద్ ఎంపిడివొ కార్యాలయం, మేడ్చల్ సూర్యనగర్‌లోని జైపాల్‌రెడ్డి నివాసంతో పాటు మరో రెండు చోట్ల సోదాలు నిర్వహించారు. అదేవిధంగా ఎంపిడివొ జైపాల్‌రెడ్డికి చెందిన 3 బ్యాంకు లాకర్లను పరిశీలించిన అధికారులు మొత్తం రూ.3.4 కోట్ల విలువ చేసే స్థిరచరాస్తులను గుర్తించారు. కాగా స్థిర, చరాస్తులతో పాటు బంగారం, నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా ఎంపిడివొ జైపాల్‌రెడ్డిపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఎసిబి అధికారులు వివరిస్తున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణకు ఆరు నెలల క్రితం జైపాల్‌రెడ్డి దరఖాస్తు చేశారని, ఆ దరఖాస్తును ఉన్నతాధికారులు పెండింగ్‌లో ఉంచారని ఎసిబి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News