Sunday, April 28, 2024

పెళ్లి పీటలెక్కనున్న విద్యుల్లేఖ..

- Advertisement -
- Advertisement -

తమిళ నటి విద్యుల్లేఖ రామన్ తెలుగు వారికి బాగా సుపరిచితం. తనదైన ఆహార్యంతో కమేడియన్‌గా రాణించింది ఈ భామ. తమిళ్ నటి అయినప్పటికీ ఎక్కువగా టాలీవుడ్‌లోనే బాగా పాపులర్ అయింది. సరైనోడు, రాజుగారి గది సహా పలు చిత్రాల్లో విద్యుల్లేఖ నటనకు మంచి గుర్తింపు దక్కింది. కోవై సరళ తర్వాత అంతగా పాపులరైన తమిళ కామెడీ నటి కూడా విద్యల్లేఖనే అని చెప్పాలి. 2018 నుంచి కెరీర్ పరంగా బిజీ నటిగా కొనసాగుతున్న విద్యుల్లేఖ త్వరలోనే పెళ్లి కూతురుగా దర్శనమివ్వనుంది. గత కొంత కాలంగా ఫిట్‌నెస్ ట్రైనర్, న్యూట్రీషియన్ సంజయ్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఆగస్టు 26న తనకు నిశ్చితార్థమైందని.. తన జిమ్ ట్రైనర్ సంజయ్ ని ప్రేమించి పెళ్లాడుతున్నానని ప్రకటించింది విద్యుల్లేఖ. తన రోకా వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్‌తేజ్, రాశీఖన్నా, సాయితేజ్, నిధి అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్, తేజస్వీ, రుహానీశర్మ, ధన్యబాలకృష్ణన్ తదితరులు విద్యుల్లేఖకు శుభాకాంక్షలు చెప్పారు.

Actress Vidyullekha gets Engagement

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News