Monday, April 29, 2024

ప్రపంచ టాప్ 20 బిలియనీర్ల జాబితా నుంచి అదానీ ఔట్!

- Advertisement -
- Advertisement -
అదానీ టోటల్ గ్యాస్ నేడు ఐదు శాతం పడిపోయింది!

ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత గౌతమ్ అదానీ షేర్లు గణనీయంగా పడిపోయాయి. నేడు(శుక్రవారం) అతడి సంస్థల షేర్లు పతనం కావడంతో మళ్లీ ప్రపంచ టాప్ 20 బిలియనీర్ల జాబితా నుంచి వైదొలిగారు. వారాంతంలో పెద్ద ఎత్తున అదానీ షేర్లను అమ్మేస్తుండడంతో అదానీ గ్రూప్ స్టాకులు చాలా వరకు పతనం అయ్యాయి. వాటిలో కొన్ని అయితే లోయర్ సర్కూట్‌ను కూడా తాకాయి. అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ నేడు దాదాపు ఐదు శాతం నష్టపోయాయి. వాటితోపాటు ఏసిసి, ఎన్‌డిటివి షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడయ్యాయి.

నేడు మార్కెట్‌లో గౌతమ్ అదానీ టాప్ లూజర్‌గా నిలిచాడు. ఒక్క రోజులోనే ఆయన 5.9 బిలియన్ డాలర్లు కోల్పోయారు. ఆయన నెట్‌వర్త్‌లో అది 9.08 శాతం. హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చినప్పటి నుంచి అదానీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పటికీ మంగళవారం మాత్రం ఆయన కంపెనీ షేర్లు ఊపందుకున్నాయి(రీబౌండెడ్). గ్లోబల్ స్టాక్ ఇండెక్స్ కంపైలర్ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్(ఎంఎస్‌సిఐ) అదానీ గ్రూప్‌కు చెందిన నాలుగు కంపెనీల వెయిటేజ్‌ను తగ్గించేస్తామని ప్రకటించాక అదానీ ప్రధాన సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ సహా ఆ గ్రూప్ కంపెనీల విలువ బాగా పడిపోయింది.

హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత గౌతమ్ అదానీ కంపెనీల నికర విలువ బాగా పడిపోయింది. 2022 డిసెంబర్ 13న 134.2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన నెట్‌వర్త్ ఇప్పుడు 59.3 బిలియన్ డాలర్ల మేరకే ఉంది. అదానీ పతనం తర్వాత ఇప్పుడు ముకేశ్ అంబానీ మాత్రమే ప్రపంచ టాప్ బిలియనీర్ల జాబితాలో ఉన్న భారతీయుడు. ప్రస్తుతం ఆయన ఆ జాబితాలో 10వ స్థానంలో ఉన్నారు. ఆయన కంపెనీల ఆస్తుల నెట్‌వర్త్ 82.5 బిలియన్ డాలర్లు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News