Monday, April 29, 2024

ఆధునిక రేడియేషన్ చికిత్సలతో తల,మెడ క్యాన్సర్లకు చెక్

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం రోగులకు రేడియేషన్ అద్బుత ఫలితాలిస్తుంది
పొగాకు, దూమపానంతో నేటి యువత క్యాన్సర్ బారిన
మూడు రకాల పద్దతులతో క్యాన్సర్ నయం చేయవచ్చు: డా. లలితారెడ్డి

Advanced radiation treatments for head cancer
మన తెలంగాణ,సిటీబ్యూరో: నేడు సమాజంలో క్యాన్సర్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. రకరకాల క్యాన్సర్లు మానవాళిపై దాడి చేస్తున్నాయి. క్యాన్సర్ నివారణకు ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నా రేడియేషన్ టెక్నాలజీ అద్భుత ఫలితాలనిస్తోంది. క్యాన్సర్ సోకిన తరువాత చికిత్స సమయంలో ఏప్పుడో ఒకప్పుడు రేడియేషన్ చికిత్స తప్పనిసరి.రేడియేషన్ చాలా వరకు కరెంట్ షాక్ భావిస్తారు. వాస్తవానికి రేడియేషన్ టెక్నాలజీని క్యాన్సర్ కణతులను చంపడానికి వాడుతారు. చికిత్సలో భాగంగా రోగనిర్దారణ కోసం తక్కువ శక్తిగల ఎక్స్ కిరణాలు ఉపయోగిస్తారు. కానీ తాము అధికశక్తిగల ఎక్స్ కిరణాలు ఉపయోగిస్తాని రెనోవా ఆసుపత్రి రేడియేషన్ అంకాలజిస్ట్ వైద్యులు కె.లలితారెడ్డి పేర్కొన్నారు. క్యాన్సర్ బాధితుల్లో నోటి క్యాన్సర్లే వారే ఎక్కువ. పొగాకు, మద్యపానం ఇప్పటికి ప్రధాన ప్రమాద కారకాలు.

నోటి క్యాన్సర్ రోగులలో ఎక్కువగా యువతీ, యువకులు, ఆరోగ్యకరమైనవారు, ధూమపానం చేయనివారు, హెచ్‌పివి వైరస్ బారిన పడినవారే ఉంటున్నారు. తల ,మెడ, క్యాన్సర్లలో నోటి పరిశుభ్రతే కీలక పాత్ర పోషిస్తుంది. తల, మెడ, క్యాన్సర్లలో నాలుక, చెంప, టాన్సిల్, లాలాజల గ్రంధి, స్వర తంతువులు, స్వరపేటిక, పారింక్స్, పార నాసల్ సైనస్ల క్యాన్సర్లు ఉన్నాయి. పొగాకు,దూమపానం చేసేవారు, ఖైనీ,పొగాకు నమిలేవారు, మద్యపానం చేసేవారు. నోటి పరిశుభ్రత సరిగా పాటించని వ్యక్తులు, పదునైన, సరిగ్గా సరిపోని దంతాలు ఉన్న వారికి హెచ్‌పివి సోకిన రోగులకు ఎక్కువగా క్యాన్సర్ సోకుతుంది. క్యాన్సర్ సైట్, దశపైనే లక్షణాలు ఆధారపడి ఉంటాయి. నోటిలో చాలాకాలంగా నయం కాని పూతలు ఉంటే, నాలుక, చెంపపై తెల్లటి మచ్చలు, దంతాలు వదులుగా ఉంటే క్యాన్సర్ లక్షణాలు గుర్తించాలి.

వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సరిగ్గా సరిపోని కట్టుడు పళ్లు, దవడ నొప్పి, గొంతులో మార్పు, మింగడంలో ఇబ్బంది, నాసికా అవరోధం, నాసికా రక్తస్రావం, బరువు తగ్గడం, ఆకలి తగ్గినా అలెర్ట్ కావాలి. లేదంటే క్యాన్సర్‌కు బలి కాక తప్పదు. క్యాన్సర్‌కు మూడు ప్రదాన పద్దతులతో చికిత్స చేయవచ్చు. కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స,మైక్రోస్కోపిక్ మెటాస్టాపిన్ను పరిష్కరించడానికి కీమోథెరపీ, క్యాన్సర్ స్దానికంగా పునరావృతం కాకుండా నిరోధించడానికి రేడియేషన్ చిక్సిత చేస్తారు. కానీ క్యాన్సర్ మరీ ఎక్కువగా ఉంటే కొంతమందికి ఈమూడు చికిత్సలు అవసరమవుతాయి. క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ను ఎలా, ఎప్పడు ఉపయోగించవచ్చు.

నోటి క్యాన్సర్లలో సర్జరీ ప్రదాన పద్దతి. కానీ బుక్కల్ మ్యూకోసల్ క్యాన్సర్లు. స్వరాపెటిక క్యాన్సర్ ప్రారంభ దశలో రేడియేషన్ చికిత్స మొదటి పద్దతి. నివారణ చికిత్సగా, శస్త్రచికిత్స తరువాత, క్యాన్సర్ దశ, ప్రదేశాన్ని బట్టి పాలియేటవ్ సెట్టింగ్‌ల్లో ఉపయోగించవచ్చు. 95శాతం కంటే ఎక్కువ క్యాన్సర్లను రేడియేషన్ నయం చేయవచ్చు. ముందుస్తుగా గుర్తించడం, అధునాతన రేడియేషన్ టెక్నిక్లతో మేము చాలా క్యాన్సర్లను దుష్ప్రబావాలు లేకుండా నయం చేయగలమన్నారు.

తల, మేడ క్యాన్సర్లలో రేడియేషన్ చికిత్సల సమయంలో జరిగే మార్పులు, తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు…..
గతంలో రేడియేషన్ చికిత్సలతో, దుష్ప్రబావాలు శాశ్వతంగా ఉండేవి. కానీ ఇప్పుడు అధునాతన సాంకేతికతలతో రోగి,సాధారణ ఆరోగ్యంపై రాజీ పడకుండా కణితిని పూర్తిగా చంపవచ్చు. క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని బట్టి తల, మెడ క్యాన్సర్ ఉన్న రోగులు వారి చికిత్స సమయంలో నోటిపూత, మందపాటి కఫం, మింగడంలో ఇబ్బంది. రుచి మార్పు, గొంతు బొంగురుపోవడం, చర్మం పిగ్మెంటేషన్ వంటి దుష్ప్రబావాలు వస్తాయి. రేడియేషన్ చికిత్స ప్రారంభించిన 2 వారాల తరువాత ఈలక్షణాలు బయటపడుతాయి. చికిత్స పూర్తియిన 2నుంచి 3 వారాల తరువాత తగ్గుతాయి. రేడియేషన్ చికిత్స చేసే సమయంలో చికిత్స తరువాత త్వరగా కోలుకోవడానికి నోటి పరిశ్రుభత పాటించి సమతుల పోషకాహారం తీసుకోవాలి.

కనిష్ట దుష్ప్రభావాలతో గరిష్ట నివారణ: తాజాగా వచ్చిన రేడియేషన్ టెక్నాలజీతో తల, మెడ క్యాన్సర్ రోగులకు చికిత్స చేయవచ్చు. తక్కువ దుష్ప్రభావాలతో నయం చేయవచ్చు. ఐజిఆర్‌టి, విమాట్, రైడ్‌ఆర్క్ వంటి రేడియేషన్ టెక్నాలజీలు క్యాన్సర్ చికిత్సల కోసం ఉపయోగిస్తున్నారు. చికిత్స సమయంలో రోగులను ఆన్‌లైన్ సిబిసిటి చిత్రాలతో పర్యవేక్షించబడతారు. సాధారణంగా క్యాన్సర్ చికిత్ససమయంలో రోగులు వ్యాధి ప్రక్రియ కారణంగా ఆకలి కోల్పోతారు. మింగడంలో ఇబ్బందులు పడతారు. దీంతో వారు బరువు కోల్పోతారు. సిబిసిటి సహాయంతో ఆడిప్టివ్ ప్లానింగ్ ద్వారా, మేము సాధారణ కణజాల రేడియేషన్ ప్రబావం పడకుండా చికిత్స చేసి క్యాన్సర్‌ను నయం చేయగలమన్నారు. చివరగా అందించే అధునాతన రేడియేషన్ టెక్నాలజీ చికిత్సలతో రోగులు క్యాన్సర్‌ను జయించి నాణ్యమైన జీవితాన్ని గడుతారని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News